Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్.. పప్పుల ధరలకు రెక్కలు
దీపావళి సమీపిస్తున్న వేళ పప్పుధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. గత నెలలో శనగపప్పు హోల్‌సేల్ ధర 11 శాతం, పెసరపప్పు 10.6 శాతం, కందిపప్పు 6.5 శాతం, బఠాణీ 6 శాతం పెరిగినట్లు సమాచారం. పండగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాభావం, విదేశీ సరఫరా మందగించడం వంటి అంశాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం వద్ద బఫర్ నిల్వలు ఉన్నప్పటికీ భవిష్యత్ సరఫరా అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
దీపావళి పండగ సమీపిస్తున్న వేళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్య కుటుంబాలకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. రోజువారీ వంటకాల్లో అత్యంత కీలకమైన పప్పుధాన్యాల ధరలు గత కొన్ని వారాలుగా అమాంతం పెరిగిపోతున్నాయి. ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (IPGA) వివరాల ప్రకారం.. గడిచిన నెల రోజుల్లోనే కొన్ని రకాల పప్పుల హోల్‌సేల్ ధరలు ఏకంగా 11 శాతం వరకు పెరిగాయి. దేశంలో ఎక్కువగా వాడే శనగపప్పు ధర నెల రోజుల్లో 11 శాతం పెరగ్గా, పెసరపప్పు 10.6 శాతం, కందిపప్పు 6.5 శాతం, బఠాణీ 6 శాతం మేర పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే బఠాణీ ఏకంగా 47 శాతం, మినప్పప్పు 24 శాతం, శనగపప్పు 23 శాతం పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో సగటున కిలో శనగపప్పు రూ. 88, కందిపప్పు రూ. 125, పెసరపప్పు రూ. 112 దాటి విక్రయిస్తున్నారు. దీంతో గృహిణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పండగ సీజన్ కావడంతో ఇళ్లలో నిత్యావసర సరుకుల నిల్వలు పెంచుకోవడం ధరల పెరుగుదలకు తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక బలమైన సరఫరా ఆందోళనలు ఉన్నాయని వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన పంట ప్రాంతాల్లో వర్షాభావం, నేలలో తేమ తగ్గడం వల్ల కంది, శనగ దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. భారత్‌కు శనగపప్పు ఎగుమతి చేసే ఆస్ట్రేలియాలో దిగుబడి తగ్గడం, రష్యా నుంచి బఠాణీ సరఫరా నెమ్మదించడం కూడా ఒత్తిడిని పెంచాయి. పండగల వేళ వినియోగం పెరగడం, భవిష్యత్తులో సరఫరా తగ్గుతుందనే వ్యాపారుల అంచనాలతో ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 274 లక్షల టన్నుల రికార్డు ఉత్పత్తితో పాటు, ప్రభుత్వం వద్ద 45 లక్షల టన్నుల బఫర్ నిల్వలు ఉన్నాయి. తక్షణ కొరత ఏమీ లేకపోయినా, రాబోయే రబీ సీజన్ అంచనాల ఆధారంగానే మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వ నిల్వల విడుదలపైనే మున్ముందు ధరల నియంత్రణ ఆధారపడి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మాస్టర్ ప్లాన్.. ఇక ఎవరూ తప్పించుకోలేరు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

