ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. విలాసవంతమైన జీవితం, మొబైల్, బంగారం కోసం ఓ జంట తమ నెల రోజుల బిడ్డను లక్ష రూపాయలకు అమ్మేసింది. ఆ చిన్నారి అనేక చేతులు మారి చివరికి హైదరాబాద్ చేరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి చిన్నారిని కాపాడారు. ఈ ఘటన డబ్బు మనిషిని ఎంత దిగజారుస్తుందో తెలియజేస్తుంది.