మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ! చివరికి ఏమైందంటే?
ఒడిశాలో ఉప్పొంగుతున్న బ్రాహ్మణి నదిలో కొట్టుకుపోయిన వృద్ధురాలు దాదాపు 12 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. కలాఖండ్ గ్రామానికి చెందిన కేసి దలై నదిలో పడిపోయిన తర్వాత సుమారు 30 కిలోమీటర్లు కొట్టుకుపోయి పట్టాముండై సమీపానికి చేరుకున్నారు. పడవలో వెళ్తున్న ఇద్దరు యువకులు ఆమెను గుర్తించి రక్షించి, ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి.
ఒడిశాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. నదుల్లో వరద ఉప్పొంగుతున్న వేళ, మొసళ్లు సంచరించే ప్రమాదకరమైన నీటిలో ఏకంగా 70 ఏళ్ల వృద్ధురాలు 12 గంటల పాటు సజీవంగా తేలియాడి, 30 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి ప్రాణాలతో బయటపడిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల కేసి దలై అనే వృద్ధురాలు శనివారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో తన ఇంటి సమీపంలో ఉన్న బ్రాహ్మణి నది ఒడ్డుకు వెళ్లారు. అయితే, అక్కడ కాలుజారి నదిలో పడిపోయారు. భారీ వర్షాల కారణంగా నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఆమె క్షణాల వ్యవధిలో మధ్యలోకి కొట్టుకుపోయింది. ఆ బామ్మ రాత్రంతా నదిలోనే తేలుతూ కొట్టుకుపోయింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి మొదలైన ఈ పోరాటం ఆదివారం ఉదయం 10 గంటల వరకు నిర్విరామంగా సాగింది. అంటే దాదాపు 12 గంటల పాటు ఆ వృద్ధురాలు నదిలోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోరాడింది. ఏ క్షణంలో ఏ మొసలి దాడి చేస్తుందో, ఏ భారీ అల వచ్చి ముంచేస్తుందో తెలియని భయానక వాతావరణంలో ఆమె నీటిపైనే తేలుతూ సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేంద్రపారా జిల్లాలోని పట్టముండై ప్రాంతానికి చేరుకుంది. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో ఇద్దరు స్థానిక వ్యక్తులు పడవలో ప్రయాణిస్తుండగా.. నదిలో తేలుతున్న కేసి దలై వారి కంట పడింది. మొదట ఏదైనా వస్తువు అనుకున్న వారు, దగ్గరకు వెళ్లి చూసేసరికి ప్రాణాలతో ఉన్న మనిషి అని గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆమెను తమ పడవలోకి ఎక్కించారు. చలితో వణికిపోతున్న ఆమె శరీరానికి మసాజ్ చేశారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. దేవుడే నను ప్రత్యక్షంగా కాపాడాడు. ఆ రాత్రి నదిలో నేను పడిన క్షణం నుంచి బతుకుతాననే నమ్మకం పోయింది. కానీ ప్రాణం పోకుండా దేవుడే నన్ను కాపాడాడు” అంటూ కేసి దలై కంటతడి పెట్టుకుంది. మొసళ్లు నిండిన ఆ భయానక నదిలో, ఎలాంటి ఆహారం, నీరు లేకుండా 12 గంటల పాటు ఒంటరిగా పోరాడి ప్రాణాలతో బయటపడిన ఈ బామ్మ సాహసగాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
Cement Price Hike: ఇంటి నిర్మాణం చేపడుతున్నారా.. సిమెంట్ ధరలు పెరిగిపోతున్నాయ్ జాగ్రత్త!
ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ
Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్.. పప్పుల ధరలకు రెక్కలు
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!

