Cement Price Hike: ఇంటి నిర్మాణం చేపడుతున్నారా.. సిమెంట్ ధరలు పెరిగిపోతున్నాయ్ జాగ్రత్త!
సొంతింటి నిర్మాణం చేపట్టాలనుకునేవారికి సిమెంట్ ధరల పెంపు భారం పెరగొచ్చు. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా సగటున రూ.7 పెరగగా, అక్టోబర్‌లో మరో రూ.5 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక పేర్కొంది. పెరిగిన ఇంధన ఖర్చులు కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. సెప్టెంబర్ నాటికి సిమెంట్ బస్తా సగటు ట్రేడ్ ధర రూ.356కు చేరింది. ప్రాంతాలవారీగా ధరల్లోనూ మార్పులు నమోదయ్యాయి.
సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి, నిర్మాణ రంగంలో ఉన్నవారికి సిమెంట్ ధరలు మళ్లీ షాక్ ఇవ్వబోతున్నాయి. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తాపై సగటున రూ. 7 పెరగ్గా, అక్టోబర్‌లో మరో రూ. 5 నుండి రూ. 20 వరకు పెంచే అవకాశం ఉందని ‘సెంట్రమ్ బ్రోకింగ్’ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా పెరిగిన ఇంధన ఖర్చులు సిమెంట్ తయారీ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దీనికి తోడు జూలై, ఆగస్టు నెలల్లో మందగించిన నిర్మాణ కార్యకలాపాలు సెప్టెంబర్ ఆఖరులో కొద్దిగా పుంజుకున్నాయి. దీంతో కంపెనీలు ధరలు పెంచేందుకు సమాయత్తమవుతున్నాయి. సెప్టెంబర్ నాటికి దేశంలో సిమెంట్ బస్తా సగటు ట్రేడ్ ధర రూ. 356కు చేరింది. గత నెలలో ప్రాంతాల వారీగా సిమెంట్ ధరల పెరుగుదలను పరిశీలిస్తే..దక్షిణ భారతదేశంలో అత్యధికంగా బస్తాపై రూ. 11 పెరిగింది. పశ్చిమ భారతంలో రూ. 9 పెరుగుదల నమోదైంది. ఉత్తర, మధ్య, తూర్పు భారతంలో బస్తాకు రూ. 5 చొప్పున ధరలు పెరిగాయి. కంపెనీలు ప్రకటించిన ఈ అదనపు భారాన్ని డీలర్లు వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయలేదు. అయితే, అక్టోబర్‌లో పెంచే ధరలు ఎంతకాలం నిలబడతాయనేది మార్కెట్ డిమాండ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో శీతాకాలంలో వచ్చే నిర్మాణ ఆంక్షల వల్ల డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ డిమాండ్ పుంజుకోకపోతే, పెంచిన ధరలను కొనసాగించడం సిమెంట్ కంపెనీలకు సవాలుగా మారవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ
Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్.. పప్పుల ధరలకు రెక్కలు
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మాస్టర్ ప్లాన్.. ఇక ఎవరూ తప్పించుకోలేరు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

