AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

Phani CH
|

Updated on: Oct 01, 2026 | 9:41 PM

Share

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఓ వృద్ధ దంపతులు తమ ఆస్తి, పిల్లల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చోర్‌పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు తమ భూమిని పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆస్తిని తిరిగి ఇప్పించాలని పలుమార్లు అధికారులను ఆశ్రయించినా పరిష్కారం కాలేదని వాపోయారు. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. ఆర్డీవో చట్టపరమైన చర్యలకు హామీ ఇచ్చారు.

కన్నబిడ్డలే తమకు చివరి ఆధారం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చివరకు వృద్ధాప్యంలో ఒంటరిగా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితాంతం కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తిని పిల్లల పేర్లపై రాసిచ్చారు. కానీ జీవిత చరమాంకంలో.. తమను చూసుకునే వారు లేక ఆ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ.. న్యాయం కోసం కలెక్టరేట్‌ మెట్లెక్కారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వృద్ధ దంపతులు.. చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. తెలంగాణలోని ఆసిఫాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన.. తల్లిదండ్రులు, పిల్లల అనుబంధంపై మరోసారి ఆలోచింపజేస్తోంది. “అసలు ఆ వృద్ధ దంపతులు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఈ స్టోరీలో డీటెయిల్‌గా చూద్దాం.” కనిపించే ప్రత్యక్ష దైవాలు అమ్మ-నాన్న అంటారు. ఎందుకంటే.. అమ్మ తన ప్రాణాలను పణంగా పెట్టి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. నాన్న తన కష్టాలను పక్కన పెట్టి.. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేస్తాడు. నడక నేర్పించడం నుంచి.. జీవితంలో స్థిరపడే వరకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తాడు. అలాంటి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవడం పిల్లల కనీస బాధ్యత. కానీ మారుతున్న కాలంలో కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, ఇతర కారణాలతో కొంతమంది వృద్ధ తల్లిదండ్రులు చివరి దశలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. జీవితమంతా పిల్లల కోసం త్యాగం చేసిన వారు.. చివరకు అదే పిల్లల నుంచి ప్రేమ, ఆదరణ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.” కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. చోర్‌పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు తీవ్ర ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్లయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తమను భవిష్యత్తులో పిల్లలే చూసుకుంటారనే నమ్మకంతో తనకున్న భూమిని వారి పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేశాడు. కానీ ఆస్తులు ఇచ్చిన తర్వాత.. బిడ్డలు తమను పట్టించుకోవడం లేదని మల్లయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. “వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన పిల్లలు దూరం కావడంతో.. ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పిల్లలకు రాసిచ్చిన తమ ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరుతూ పలుమార్లు అధికారులను ఆశ్రయించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.” ఇలా ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడం లేదనే బాధతో.. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తమ సమస్యను పరిష్కరించాలని.. తమ పిల్లలపై చర్యలు తీసుకోవాలని మల్లయ్య దంపతులు అధికారులను వేడుకున్నారు. వారి ఫిర్యాదులను పరిశీలించి.. చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. “జీవితాంతం పిల్లల కోసం బతికిన తల్లిదండ్రులకు.. వృద్ధాప్యంలో కావాల్సింది ఆప్యాయత, ఆసరా. కానీ చివరి దశలో అదే తల్లిదండ్రులు ఒంటరిగా మారితే.. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. వృద్ధుల సంరక్షణ, వారి గౌరవం, హక్కుల విషయంలో కుటుంబాలు, సమాజం మరింత బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటిచెబుతోంది.”

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ! చివరికి ఏమైందంటే?

సూపర్ మార్కెట్‌ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!

Cement Price Hike: ఇంటి నిర్మాణం చేపడుతున్నారా.. సిమెంట్‌ ధరలు పెరిగిపోతున్నాయ్‌ జాగ్రత్త!

ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ

Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

Follow Us