అక్టోబర్ 1 నుంచి WhatsApp బిజినెస్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. అయితే, మీ వ్యక్తిగత వాట్సప్ సందేశాలు యధావిధిగా ఉచితంగానే ఉంటాయి. కంపెనీలు తమ కస్టమర్లకు పంపే సర్వీస్ మెసేజ్‌లకు, ఆర్డర్ కన్ఫర్మేషన్ వంటి వాటికి నెలలో మొదటి వెయ్యి మెసేజ్‌ల తర్వాత ప్రతి మెసేజ్‌కు దాదాపు 12 పైసల ఛార్జ్ పడుతుంది. చిన్న వ్యాపారాలకు ఈ నిబంధన వర్తించదు.