Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?
ఆమె ఒక స్టార్ కిడ్ మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతురాలు కూడా. చర్మ సౌందర్యం విషయంలో ప్రపంచమంతా కొత్త కొత్త ట్రెండ్స్ వెంట పడుతుంటే, ఆమె మాత్రం పాత పద్ధతులనే నమ్ముకున్నారు. ఒకానొక సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల తీవ్రమైన మొటిమల సమస్యను ఎదుర్కొన్న

ఇప్పుడు తన చర్మాన్ని ఎలా కాపాడుకుంటోందో వివరించారు. ఖరీదైన మేకప్ కిట్ల కంటే క్రమశిక్షణతో కూడిన అలవాట్లే ముఖ్యమని చెబుతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు.. సారా టెండూల్కర్. నేటి కాలంలో ‘గ్లాస్ స్కిన్’ లేదా మెరిసే చర్మం కోసం పది నుండి పదిహేను రకాల సౌందర్య సాధనాలను వాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు విని రకరకాల క్రీములు, సీరమ్స్ కొంటూ చర్మంపై ప్రయోగాలు చేసేవారు ఎందరో ఉన్నారు.
అయితే, అతి తక్కువ ఉత్పత్తులతో సరళమైన జీవనశైలిని అనుసరిస్తూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయ, బయోమెడికల్ సైంటిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ అయిన ఒక యువ గ్లామర్ ఐకాన్ ముందు వరుసలో ఉన్నారు.
మొటిమలు, పీసీఓఎస్ (PCOS)..
పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు చర్మం జిడ్డుగా మారి మొటిమలు రావడం సహజం. సారా కూడా ఈ సవాలును ఎదుర్కొన్నారు. అంతర్గత ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం ఎంత దగ్గరగా ముడిపడి ఉంటాయో ఈ సమస్య ద్వారా ఆమెకు అర్థమైంది. కేవలం పైన రాసే క్రీముల వల్ల ఫలితం ఉండదని, లోపల నుండి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలని ఆమె గుర్తించారు. ఇందుకోసం ఆమె శుభ్రమైన ఆహారం, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి పద్ధతులను ఎంచుకున్నారు.
సింపుల్ కేర్..
సారా చర్మం చాలా సున్నితమైనది, అందుకే ఆమె కేవలం సున్నితమైన క్లెన్సర్లు, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్లు మాత్రమే ఉపయోగిస్తారు. “ఎక్కువ ఉత్పత్తులు వాడితే త్వరగా ఫలితాలు వస్తాయని ఒకప్పుడు నమ్మేదాన్ని, కానీ చర్మం యొక్క సహజత్వాన్ని గౌరవించడం నేర్చుకున్నాక పెద్ద మార్పు వచ్చింది” అని ఆమె పేర్కొన్నారు. ఉదయం వేళ చర్మాన్ని పర్యావరణ కాలుష్యం నుండి కాపాడుకోవడం, రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించి చర్మం కోలుకునేలా చేయడం ఆమె దినచర్యలో భాగం.
ఒక బయోమెడికల్ సైంటిస్ట్ గా సారా ఎప్పుడూ శాస్త్రీయంగా నిరూపితమైన ఉత్పత్తులనే ఎంచుకుంటారు. ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాలు పాటించినా, అవి అతిగా ఉండవు. సరిపడా నీరు తాగడం, ప్రశాంతమైన నిద్ర, చక్కెర మరియు నూనె పదార్థాలకు దూరంగా ఉండటం వంటి ప్రాథమిక సూత్రాలే చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయని ఆమె నమ్ముతారు.
మొటిమల కోసం సొంత ప్రయోగాలు చేయకుండా చర్మ నిపుణులను సంప్రదించడం ఆమె అలవాటు. సారా టెండూల్కర్ స్కిన్‌కేర్ గైడ్ మనకు ఇచ్చే సందేశం ఒక్కటే.. అందం అనేది మనం వాడే వంద రకాల ప్రొడక్ట్స్ లో లేదు, మనం పాటించే క్రమశిక్షణలో ఉంది. ఖరీదైన ఉత్పత్తుల కోసం డబ్బు వృథా చేసే కంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే సహజమైన మెరుపు సొంతమవుతుంది.
