Technology Tips: కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అయినట్లే..
మీరు ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే షాపుకు వెళ్లే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీ అవసరాలకు అనుగుణండా ఎలాంటి ల్యాప్ టాప్ తీసుకోవాలనేది ముందు ఫిక్స్ అవ్వాలి. మీరు ఏ పనుల కోసం ల్యాప్‌టాప్ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్లు తీసుకోవాలి.

ఉద్యోగం, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాప్‌టాప్ అనేది అత్యవసరంగా మారింది. ల్యాప్‌టాప్ ఉంటే ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఒకచోట నుంచి మరోచోటకు బ్యాగ్‌లో పెట్టుకుని సులువుగా తీసుకెళ్లవచ్చు. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్‌లు ఎక్కువవుతున్న క్రమంలో ల్యాప్‌టాప్ అనేది తప్పనిసరి అయింది. ఇక ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్ల కోసం విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ అవసరం అవుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం అనేది పెరిగిపోయింది. అయితే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రాసెసర్, ర్యామ్ ఎంపిక
మీ అవసరాలను బట్టి ప్రాసెసర్, ర్యామ్ ఎంచుకోవాలి. సాధారణ బ్రౌజింగ్, ఆన్ లైన్ క్లాసుల కోసం అయితే Core i3, AMD Ryzen ప్రాసెసర్ సరిపోతుంది. ఇక కోడింగ్, గేమింగ్ కోసం Intel Core i5, AMD Ryzen 5 తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ర్యామ్ విషయానికొస్తే.. కనీసం 8జీబీ ర్యామ్ ఉండే ఉండే ల్యాప్‌టాప్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పనుల కోసం 16జీబీ ర్యామ్ తీసుకోవాలి.
గ్రాఫిక్, ఎస్‌ఎస్‌డీ కార్డ్
ఇక గ్రాఫిక్, ఎస్‌ఎస్‌డీ కార్డ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్‌ఎస్‌డీ ద్వారా ఫైల్స్ వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. కనీసం 512జీబీ ఎస్‌ఎస్‌డీ ఉండాలి. ఇక వీడియో ఎడిటింగ్, 3డీ మోడలింగ్,. గేమింగ్ కోసం ప్రత్యేకమైన గ్రాఫిక్స్ కార్డ్ అవసరం. సాధారణ అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు సరిపోతుంది.
బ్యాటరీ బ్యాకప్, పోర్టులు
ఇక బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ముఖ్యం. కనీసం 6 నుంచి 8 గంటల వరకు బ్యాకప్ ఉండేలా బ్యాటరీ చూసుకోవాలి. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే బ్యాటరీ ఎంచుకోవాలి. ల్యాప్ టాప్ బరువు తక్కువగా ఉంటే మంచిది. ఇక కనెక్టివిటీ పోర్టులు ఉండేలా చూసుకోవాలి. SB Type-C, USB 3.0, HDMI, ఆడియో జాక్ వంటి పోర్టులు ఉండేలా చూసుకోవాలి. ఈ పోర్టులు మీకు ఫైల్స్ సులువుగా పంపించుకోవడం, చార్జింగ్ త్వరగా పెట్టుకోవడంలో సహాయపడతాయి. ఇక ల్యాప్‌టాప్‌కు వ్యారంటీ ఉండేలా చూసుకోవాలి. మినిమం ఒక ఏడాది వ్యారెంటీ ఉండేలా చూసుకోండి. దీని వల్ల మీ ల్యాప్‌టాప్‌కు ఏమైనా జరిగితే భద్రత ఉంటుంది. కొంతమందికి వీటి గురించి ఇవేమీ అవగాహన లేకుండా ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసి ఇబ్బంది పడతారు. ల్యాప్ టాప్ అనేది ఎన్నో ఏళ్ల పాటు మనకు ఉపయోగపడుతుంది. అందుకే కొనుగోలు చేసేముందు అన్నీ విషయాలు తెలసుకుని కొనుగోలు చేయండి.
