AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 స్టార్ రేటింగ్​ సాధించిన మహీంద్రా కారు.. Mahindra XEV 9S ఎందులో టాప్​ తెలిస్తే అందరికీ మతిపోతుంది

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో బ్యాటరీ రేంజ్‌, ఛార్జింగ్ వేగంతో పాటు భద్రతకు కూడా వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Mahindra తన ఎలక్ట్రిక్ SUV XEV 9Sతో మరోసారి వార్తల్లో నిలిచింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. పెద్దలతో పాటు పిల్లల భద్రత విభాగాల్లోనూ మంచి స్కోర్లు నమోదు చేసింది. ఈ రేటింగ్‌ XEV 9S అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.

5 స్టార్ రేటింగ్​ సాధించిన మహీంద్రా కారు.. Mahindra XEV 9S ఎందులో టాప్​ తెలిస్తే అందరికీ మతిపోతుంది
Mahindra Xev 9s Bncap Crash Test
Nikhil
|

Updated on: Nov 19, 2026 | 9:00 PM

Share

క్రాష్ టెస్టుల్లో సాధించిన ఫలితాలు ఈ SUV భద్రతా ప్రమాణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. Mahindraకు చెందిన ఇతర SUVలతో పాటు Tata Safari స్కోర్లతో పోల్చినప్పుడు కూడా XEV 9S మంచి పాయింట్లు సాధించింది. ముఖ్యంగా ఫ్రంటల్‌, సైడ్ ఇంపాక్ట్ పరీక్షల్లో ప్రయాణికులకు అందించిన రక్షణ ఈ ఫలితాల్లో కీలకంగా నిలిచింది. చిన్నారుల భద్రత కోసం నిర్వహించిన ప్రత్యేక పరీక్షల్లోనూ ఈ కారు పూర్తి పాయింట్లు సాధించడం విశేషం.

క్రాష్ టెస్టుల్లో మంచి ఫలితాలు

BNCAP పరీక్షల్లో వయోజన ప్రయాణికుల రక్షణ (AOP) విభాగంలో XEV 9Sకు 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు వచ్చాయి. పిల్లల రక్షణ (COP) విభాగంలో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. పోల్చి చూస్తే Mahindra XUV 7XO పెద్దల భద్రతలో 30.76, పిల్లల భద్రతలో 44.97 పాయింట్లు పొందింది. Tata Safari వరుసగా 30.08, 44.54 పాయింట్లు సాధించింది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్టులో డ్రైవర్ తల, మెడ, ఛాతీ, కాళ్లకు మంచి రక్షణ లభించింది. కో-డ్రైవర్‌కు కూడా దాదాపు అన్ని శరీర భాగాల్లో మంచి రక్షణ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. అయితే ఛాతీ భాగానికి మాత్రం తగినంత రక్షణ మాత్రమే లభించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్, సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షల్లోనూ మంచి ఫలితాలు నమోదయ్యాయి.

అధునాతన ఫీచర్లు

చిన్నారుల భద్రతా పరీక్షల్లో XEV 9S డైనమిక్ టెస్టులో 24కి 24 పాయింట్లు సాధించింది. చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ పరీక్షలోనూ 12కి 12 పాయింట్లు దక్కించుకుంది. అయితే వెహికల్ అసెస్‌మెంట్‌లో 13కి 9 పాయింట్లు మాత్రమే రావడంతో మొత్తం స్కోరు 45కి చేరింది. 18 నెలలు, మూడేళ్ల చిన్నారుల డమ్మీలతో నిర్వహించిన ఫ్రంటల్‌, సైడ్ క్రాష్ పరీక్షల్లో పూర్తి పాయింట్లు సాధించింది.

భద్రత కోసం ఈ SUVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ఉన్నాయి. కొన్ని టాప్ వేరియంట్లలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందిస్తున్నారు. టాప్-స్పెక్ మోడళ్లలో ADAS ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీలు డ్రైవింగ్ సమయంలో భద్రతను పెంచేందుకు ఉపయోగపడతాయి.

Follow Us