AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్ యూజర్లకు యాపిల్ గుడ్‌న్యూస్.. iOS 27.3లో అదిరిపోయే కొత్త ఫీచర్లు.. పూర్తి వివరాలివే

ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా iOS 27.3 రెండో డెవలపర్ బీటా అప్‌డేట్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా iPhone 18 Pro మోడళ్లతో పాటు యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని పలు మార్పులు చేసింది. ఫోన్‌ను మడతపెట్టిన స్థితిలోనే ఫేస్ అన్‌లాక్ చేసుకునే సదుపాయం, మడతపెట్టగానే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే ఫీచర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఐఫోన్ యూజర్లకు యాపిల్ గుడ్‌న్యూస్.. iOS 27.3లో అదిరిపోయే కొత్త ఫీచర్లు.. పూర్తి వివరాలివే
Apple Ios 27.3 Developer Beta 2
Nikhil
|

Updated on: Nov 19, 2026 | 8:10 PM

Share

స్మార్ట్‌ఫోన్‌లలో కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లు పెరుగుతున్న నేపథ్యంలో బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా యాపిల్ మరో అడుగు వేసింది. సఫారీ బ్రౌజర్‌లో సిరి సాయంతో వెబ్‌పేజీల సమాచారాన్ని అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు పొందే అవకాశం కల్పించింది. యాపిల్ టీవీలో వీడియో పాడ్‌కాస్ట్‌లకు కూడా సపోర్ట్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు డెవలపర్లకు అందుబాటులో ఉండగా, సాధారణ వినియోగదారులకు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఫోల్డ్ చేసినా ఫేస్ అన్‌లాక్..

iPhone Duoలో టచ్ ఐడీతో పాటు కొత్తగా ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందించారు. ఫోన్ బయటి డిస్‌ప్లేపై ఉన్న ఫ్రంట్ కెమెరా ముఖాన్ని గుర్తించి లాక్ స్క్రీన్‌ను తెరుస్తుంది. సెట్టింగ్స్‌లోని Touch ID & Passcode విభాగంలో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే ఇది పూర్తిస్థాయి Face ID కాదు. ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు లాక్ స్క్రీన్‌ను తెరవడానికి మాత్రమే పనిచేస్తుంది. Apple Pay చెల్లింపులు, పాస్‌వర్డ్‌ల కోసం టచ్ ఐడీనే ఉపయోగించాలి. 45 నిమిషాల పాటు ఫోన్ వాడకపోతే, మళ్లీ టచ్ ఐడీతో అన్‌లాక్ చేసిన తర్వాతే కెమెరా ఆధారిత అన్‌లాక్ పనిచేస్తుంది.

అలాగే Close to Lock అనే కొత్త ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చింది. Display & Brightness సెట్టింగ్స్‌లో దీన్ని ఆన్ చేసుకుంటే ఫోన్‌ను మడతపెట్టగానే స్క్రీన్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. దీనివల్ల ఫోన్‌ను ఉపయోగించడం పూర్తయ్యాక ప్రత్యేకంగా లాక్ చేయాల్సిన అవసరం ఉండదు.

యాపిల్ టీవీలో కొత్త ఫీచర్

సఫారీ బ్రౌజర్‌లో Ask about Page అనే కొత్త ఫీచర్‌ను యాపిల్ జోడించింది. పెద్ద ఆర్టికల్ లేదా వెబ్‌పేజీ చదువుతున్నప్పుడు అందులోని సమాచారంపై సిరిని ప్రశ్నించవచ్చు. స్క్రీన్‌పై ప్రస్తుతం కనిపించని కింది భాగంలోని వివరాలను కూడా సిరి అర్థం చేసుకుని సమాధానాలు ఇస్తుంది. ఉదాహరణకు ట్రావెల్ గైడ్ చదువుతున్నప్పుడు ప్యాకింగ్ లిస్ట్ తయారు చేయమని అడిగితే, ఆ వివరాల ఆధారంగా జాబితాను రూపొందించి నోట్స్‌లో సేవ్ చేస్తుంది.

మరోవైపు Apple TV యాప్‌లో వీడియో పాడ్‌కాస్ట్‌లకు సపోర్ట్ అందించింది. అలాగే 2 లక్షలకు పైగా యాప్‌లు iPhone Duo ఫోల్డబుల్ డిస్‌ప్లేకు అనుగుణంగా అప్‌డేట్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం iOS 27.3 బీటా అప్‌డేట్‌లో ఉన్న ఈ మార్పులు, త్వరలో విడుదలయ్యే పూర్తి వెర్షన్‌లో సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us
ఫోన్​ క్లోజ్ చేస్తే ఆటో లాక్​ అయిపోతుంది.. సఫారీలో అప్​గ్రేడ్‌
ఫోన్​ క్లోజ్ చేస్తే ఆటో లాక్​ అయిపోతుంది.. సఫారీలో అప్​గ్రేడ్‌
మేక మాంసాన్ని ‘మటన్’ అని ఎందుకు పిలుస్తారు?
మేక మాంసాన్ని ‘మటన్’ అని ఎందుకు పిలుస్తారు?
బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన శివాజీ..
బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన శివాజీ..
ఆధార్‌లో పేరు మార్చుకోవడం అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్ వచ్చేశాయ్!
ఆధార్‌లో పేరు మార్చుకోవడం అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్ వచ్చేశాయ్!
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!