AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో బెస్ట్ యాప్స్, గేమ్స్ ఇవే.. గూగుల్ ప్లే అవార్డుల విజేతల జాబితా విడుదల

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో వేలాది యాప్స్, గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అత్యుత్తమ పనితీరు, కొత్త ఆలోచనలు, వినియోగదారులకు ఉపయోగపడే ఫీచర్లతో ప్రత్యేక గుర్తింపు పొందిన వాటిని గూగుల్ ప్రతి ఏడాది ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా Google Play Best of 2026 అవార్డుల విజేతలను భారత్‌లో ప్రకటించింది. ఈసారి వీడియో ఎడిటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోజువారీ అవసరాలు, వినోదం, క్రీడలు, గేమింగ్ వంటి విభాగాల్లో పలు యాప్స్, గేమ్స్‌కు గుర్తింపు లభించింది.

2026లో బెస్ట్ యాప్స్, గేమ్స్ ఇవే.. గూగుల్ ప్లే అవార్డుల విజేతల జాబితా విడుదల
Google Play Best Of 2026 India Winners
Nikhil
|

Updated on: Nov 19, 2026 | 8:00 PM

Share

ఈ ఏడాది విజేతల జాబితాలో అంతర్జాతీయ యాప్‌లతో పాటు భారతీయ డెవలపర్లు రూపొందించిన యాప్‌లు కూడా చోటు దక్కించుకున్నాయి. Adobe Premiere బెస్ట్ యాప్ ఆఫ్ 2026గా నిలవగా, Arknights: Endfield బెస్ట్ గేమ్ అవార్డును గెలుచుకుంది. వినియోగదారుల సృజనాత్మకతను పెంచడంతో పాటు రోజువారీ పనులను సులభతరం చేసే యాప్‌లకు ఈసారి ప్రాధాన్యత లభించింది. అలాగే విభిన్న గేమింగ్ అనుభవాలను అందించే గేమ్‌లను కూడా గూగుల్ ఎంపిక చేసింది.

బెస్ట్ యాప్స్ 2026..

Google Play Best of 2026 జాబితాలో Adobe Premiere బెస్ట్ యాప్‌గా నిలిచింది. మొబైల్‌లోనే మల్టీట్రాక్ టైమ్‌లైన్, వీడియో ఎడిటింగ్, స్పీచ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి టూల్స్‌తో వీడియోలను రూపొందించుకునే అవకాశం కల్పిస్తోంది. Creative Expression విభాగంలో ibis Paint X అవార్డు గెలుచుకుంది. ఇలస్ట్రేషన్స్, యానిమేషన్ల తయారీకి ఇందులో పలు టూల్స్ ఉన్నాయి. Innovative Appగా Wispr Flow ఎంపికైంది. వాయిస్ ద్వారా చెప్పిన మాటలను తప్పులు, అనవసర పదాలు తొలగించి చక్కని టెక్స్ట్‌గా మార్చుతుంది. హిందీ, హింగ్లిష్ సహా పలు భాషలకు మద్దతు ఇస్తుంది.

భారతీయ యాప్‌లలో Pronto బెస్ట్ ప్రొడక్టివిటీ పార్ట్‌నర్‌గా నిలిచింది. ఇంటి శుభ్రత, లాండ్రీ వంటి పనులకు సహాయం బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. Baby Development & Milestones తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదల, అభివృద్ధి దశలను ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. Zolio: Daily Journal & Diary వ్యక్తిగత విషయాలను డైరీ రూపంలో నమోదు చేసుకునేందుకు సహాయపడుతుంది. Pocket FM బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌గా, FanCode స్పోర్ట్స్ అభిమానులకు ఉత్తమ యాప్‌గా ఎంపికయ్యాయి. Strava బెస్ట్ క్రాస్ డివైస్ యాప్‌గా, Pocket Casts బెస్ట్ ఫర్ వాచెస్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నాయి.

బెస్ట్ గేమ్స్ 2026..

గేమింగ్ విభాగంలో Arknights: Endfield బెస్ట్ గేమ్‌తో పాటు బెస్ట్ స్టోరీ అవార్డును కూడా గెలుచుకుంది. ఇందులో Talos-II అనే విస్తారమైన ప్రపంచంలో అన్వేషణ, వనరుల సేకరణ, పారిశ్రామిక నిర్మాణం వంటి అంశాలు ఉంటాయి. Monument Valley 3 బెస్ట్ ఇండీ గేమ్‌గా నిలిచింది. Pokémon Champions బెస్ట్ మల్టీప్లేయర్ గేమ్‌గా, Astro Arena: 3vs3 MOBA బెస్ట్ పిక్ అప్ అండ్ ప్లే గేమ్‌గా ఎంపికయ్యాయి.

భారత్‌లో రూపొందిన ScarFall 2.0 బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా గేమ్ అవార్డును గెలుచుకుంది. ఇందులో ముంబై నగర ప్రాంతాలు, లోకల్ రైళ్లు వంటి భారతీయ నేపథ్యాలను గేమింగ్‌లో భాగం చేశారు. eFootball బెస్ట్ ఆన్‌గోయింగ్ గేమ్‌గా నిలిచింది. Deep Rock Galactic: Survivor బెస్ట్ క్రాస్ డివైస్ గేమ్ అవార్డును సొంతం చేసుకుంది. Androidతో పాటు PCలోనూ ఆడుకునే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. ఇలా 2026లో యాప్‌లు, గేమ్స్ విభాగాల్లో సృజనాత్మకత, వినియోగదారుల అవసరాలు, కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యత లభించింది.

Follow Us
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో