AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా దిమ్మతిరిగే సీన్..

చెన్నై కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దందా గుట్టు రట్టయింది. సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు భారీగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న స్మగ్లర్ల ప్లాన్‌ను డీఆర్ఐ అధికారులు సినిమా ఫక్కీలో భగ్నం చేశారు. ఈ ఏడాదిలోనే అత్యధికంగా ఏకంగా రూ.710 కోట్ల విలువైన 71.24 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసి, ఇద్దరు నిందితులను కటకటాల వెనక్కి పంపారు. అసలు ఈ భారీ స్మగ్లింగ్ ఆపరేషన్ ఎలా బయటపడిందంటే..?

ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా దిమ్మతిరిగే సీన్..
Dri Seizes 71.24 Kg Heroin Worth Rs 710 Crore
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Nov 19, 2026 | 7:19 PM

Share

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. చెన్నై కేంద్రంగా శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న భారీ మాదకద్రవ్యాల గుట్టును రట్టు చేశారు. ఈ ఏడాదిలోనే అత్యధికంగా సుమారు రూ.710 కోట్ల విలువైన 71.24 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో DRI అధికారులు నవంబర్ 17, 18 తేదీల్లో చెన్నైలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా చెన్నైని ట్రాన్సిట్ పాయింట్‌గా మార్చుకుని, తిరుచిరాపల్లి మీదుగా సముద్ర తీర ప్రాంతం ద్వారా శ్రీలంకకు హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ వేసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో 69 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 71.24 కేజీల హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.700 కోట్ల నుంచి రూ.710 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్.. వాహనాలు సీజ్

డ్రగ్స్ తరలిస్తున్న వాహనంతో పాటు దానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న ఒక టూవీలర్‌ను కూడా DRI అధికారులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమిళనాడుకు చెందిన అబ్దుల్ షుకూర్, షఫీక్ అహ్మద్‌గా గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం-1985 నిబంధనల ప్రకారం డ్రగ్స్, వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ముఠా మూలాలపై ఆరా..

ఈ భారీ డ్రగ్స్ ఎక్కడి నుంచి చెన్నైకి చేరాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ మాఫియా నెట్‌వర్క్ ఏంటి? అనే కోణంలో DRI అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ చేరవేసే ముఠా మూలాలను పెకిలించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.

Follow Us
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఆరోగ్యమే అసలైన సంపద.. దీర్ఘాయుష్షుపై విజయ్ దేవరకొండ, పీవీ సింధు..
ఆరోగ్యమే అసలైన సంపద.. దీర్ఘాయుష్షుపై విజయ్ దేవరకొండ, పీవీ సింధు..
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!
ఎండకు ముఖం నల్లబడిందా? ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వేయాల్సిందే
ఎండకు ముఖం నల్లబడిందా? ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వేయాల్సిందే
లక్ష కోట్ల క్లబ్‌లో మేఘా.. ఇన్‌ఫ్రా రంగంలో మేఘా సరికొత్త చరిత్ర..
లక్ష కోట్ల క్లబ్‌లో మేఘా.. ఇన్‌ఫ్రా రంగంలో మేఘా సరికొత్త చరిత్ర..