మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై, తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పెళ్లి పేరుతో రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేసి, నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బండారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపులతో బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
నిందితుడు మధు తనను తాను Food Corporation of India (FCI) లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. నమ్మకం కలిగించేందుకు చెర్లపల్లిలో ఉద్యోగం చేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డులను కూడా సృష్టించాడు. ఈ క్రమంలో ఒక బాధితురాలితో పెళ్లి నిశ్చయించుకుని, మొదట 2 కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేశాడు. చివరకు కోటిన్నరకు ఒప్పందం కుదుర్చుకుని, నల్గొండలో ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో బాధితురాలిని తన గదికి పిలిపించి, ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీయగా, అతను నకిలీ ఐడీలతో మోసం చేస్తున్నాడని తేలింది. వెంటనే ఆమె చైతన్యపురి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు నకిలీ FCI ఐడీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్ మరియు On Government Duty అని రాసి ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్!
ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్
షారుఖ్ ప్లేస్‌ని రణ్‌వీర్ కొట్టేస్తారా?
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

