AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

Phani CH
|

Updated on: Jul 31, 2026 | 3:37 PM

Share

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మిన బెంగళూరుకు చెందిన ఓ మహిళ రూ.1.75 కోట్ల భారీ మోసానికి గురైంది. విదేశాల నుంచి చౌకగా వజ్రాభరణాలు, ఖరీదైన చీరలు తెప్పిస్తానని నమ్మించి, కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో విడతలవారీగా డబ్బు వసూలు చేశారు. చివరకు నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మితే ఎంతటి ప్రమాదమో తెలిపే మరో ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఖరీదైన చీరలు, వజ్రాభరణాలు తక్కువ ధరకే వస్తాయన్న ఆశతో ఓ మహిళ ఏకంగా రూ.1.75 కోట్లు పోగొట్టుకుని వీధిన పడాల్సి వచ్చింది. బాధితురాలికి ‘సాహిల్ జుగ్గల్’ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. తాను ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. విదేశాల నుంచి అత్యంత విలువైన వజ్రాభరణాలు, చీరలను చౌకగా తెచ్చిస్తానని నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మిన ఆమెతో రోజూ ఫోన్లో మాట్లాడి ఆత్మీయతను పెంచుకున్నాడు. ఆ తర్వాత తన వద్ద భారతీయ కరెన్సీ లేదని, విదేశాల నుంచి వచ్చిన బహుమతి పార్సెల్ కస్టమ్స్ క్లియరెన్స్ కోసం నగదు కావాలని నమ్మబలికాడు. నిందితుడి మాటలు నమ్మి బెంగళూరులోని ఒక హోటల్‌లో ఓ వ్యక్తికి రూ.40 లక్షలు అందజేసింది. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులమంటూ కొందరు కేటుగాళ్లు ఫోన్ చేసి, వజ్రాభరణాల మూట వచ్చిందని మరో రూ.1.28 కోట్లు గుంజారు. ఇలా ఇతర ఖర్చుల పేరుతో మొత్తం రూ.1.75 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేయించుకున్నాక నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితురాలు బెంగళూరు నగర ఉత్తర విభాగం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠా కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్‌!

Follow Us