యాంకర్ సుమ కనకాల చిత్రసీమలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆమెను ఘనంగా సత్కరించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు సుమనే నిజమైన హీరో అని ఎన్టీఆర్ ప్రశంసించగా, రాజమౌళి సుమకు సర్ప్రైజ్ గిఫ్ట్‌ను అందించారు. ఆమె సినీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ఒక ఏవిని ప్రదర్శించారు.