లక్షల జీతం ఇచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని బెంగళూరులో ఓ యువతి రాపిడో ఆటో నడుపుతోంది. తండ్రి మరణానంతరం తల్లికి తోడుగా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. సమాజం మాటలను పట్టించుకోకుండా, తల్లికి ప్రాధాన్యతనిస్తూ, ఇప్పుడు ఐటీ జాబ్ కంటే ఎక్కువ సంపాదిస్తూ, సంతోషంగా జీవిస్తోంది.