కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!
కర్నూలులో ఉచిత సిమ్ కార్డుల పేరుతో మహిళల ఆధార్ వివరాలు సేకరించిన కేటుగాళ్లు, వారికి తెలియకుండా పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిచి ‘తల్లికి వందనం’ పథకం కింద జమ అయిన డబ్బును కాజేశారు. దాదాపు 60 మందికి పైగా మహిళలు ఈ మోసానికి గురయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోజు రోజుకీ కేటుగాళ్ల మోసాలకు అంతులేకుండా పోతోంది. పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఆఖరికి పేద విద్యార్ధుల చదువుకోసం ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని కూడా దోచేస్తున్నారు. అమాయక మహిళలను మోసం చేసి తల్లికి వందనం డబ్బులు కాజేసిన ఘరానా మోసం కర్నూలులో వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్లో కర్నూలు నగరంలోని పాతబస్తీ, ప్రజానగర్ కాలనీల్లో ఓ ప్రైవేట్ టెలికాం ప్రతినిధి ఉచితంగా సిమ్ కార్డులు ఇస్తామని నమ్మబలికాడు. స్థానిక మహిళల నుంచి ఆధార్ కార్డులు సేకరించి, వారికే తెలియకుండా పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను తెరిచాడు. అనంతరం ప్రభుత్వం ‘తల్లికి వందనం’ కింద జమ చేసిన నగదును గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చేశాడు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చిన లబ్ధిదారులు మీసేవా కేంద్రంలో తనిఖీ చేయగా ఈ మోసం బయటపడింది. దాదాపు 60 మందికి పైగా మహిళలు ఈ విధంగా బాధితులుగా మారారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేమని, తమకు తక్షణమే న్యాయం చేయాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ సీఐ మారుతి శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎంతమంది మోసపోయారనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!
Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’
హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్ఎక్స్.. స్టార్షిప్
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్
మిఠాయిలపై తేనెటీగల దాడి..లబోదిబోమన్న వ్యాపారి!
బాంబ్లా పేలిన ఫ్రిడ్జ్.. ఇల్లు దగ్ధం!
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్

