వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
తెలంగాణకు చెందిన శ్రీనివాస్ గుప్తా–పద్మ దంపతుల పిల్లలు దేవాన్ష్, అక్షర అమెరికాలో తమ అసాధారణ ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పి ప్రెసిడెంట్ వాలంటరీ సర్వీస్ అవార్డు అందుకోగా, అక్షర కూడా ప్రత్యేక పోటీల్లో విజేతగా నిలిచి అదే పురస్కారం దక్కించుకుంది. పిల్లల ప్రతిభను గుర్తించి తల్లి చేసిన త్యాగం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రస్తుత కాలంలో పెద్దవారే కాదు చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు..చిన్నారులకు అన్నం తినిపించాలంటే సెల్‌ఫోన్ చేతికివ్వాల్సిందే.. వారిని నిద్రపుచ్చాలన్నా.. వారు ఆడుకోవాలన్న సెల్ ఫోన్ కావాల్సిందే. కానీ పట్టుమని పదేళ్లు కూడా లేని ఇద్దరు చిన్నారులు మాత్రం అన్ని రంగాల్లో అమోఘంగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు.. అది కూడా అగ్రరాజ్యమైన అమెరికాలో.. ఇదిగో ఇక్కడ ముద్దుగా బొద్దుగా కనిపించే ఈ చిన్నారులు తెలంగాణ కి చెందిన శ్రీనివాస్ గుప్తా- పద్మ దంపతుల పిల్లలు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన శ్రీనివాస్ అక్కడే స్థిరపడ్డారు. వారికి దేవాన్ష్, అక్షర ఇద్దరు పిల్లలు. పువ్వుపుట్టగానే పరమళిస్తుంది అన్న చందంగా ఇద్దరు పిల్లలు చిన్నతనంలోనే తమ అసాధారణ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం చిన్నారుల తల్లి పద్మ నెలకు 10 లక్షలకు పైగా జీతం వచ్చే తన ఉద్యోగాన్నే వదిలేసింది. పిల్లలకు ఇష్టమైనవేంటో తెలుసుకున్న ఆమె ఆయా రంగాల్లో తనకు అనుభవం లేకున్నా రోజుల కొద్దీ సమయం కేటాయించి గంటలకొద్ది సమాచారం సేకరించి తానే స్వయంగా శిక్షకురాలుగా మారారు. చిన్నారులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. దేవాన్ష్ చిన్నతనం నుంచి చురుగ్గా ఉండేవాడు. చదువులోనే కాదు ఆటపాటల్లో యాక్టీవ్‌గా ఉంటాడు. ఒకవైపు స్కూల్ కి వెళ్తూనే మరో వైపు తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆటలాడుతూ ఔరా అనిపిస్తున్నాడు. చదువులో అతడిఅసాధారణ పఠనా సామర్థ్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. సుదీర్ఘంగా చదివితే రికార్డులకు ఎక్కవచ్చు.. ప్రపంచ గుర్తింపు పొందవచ్చు అని దేవాన్ష్‌ను ఆ దిశగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. దేవాన్ష్ కృషితో జార్జియాలో జరిగిన ” లాంగెస్ట్ కంటిన్యూయస్ రీడింగ్ మారథాన్ ” లో పాల్గొన్నాడు. తొలి ప్రయత్నంలోనే కేవలం పది గంటల్లోనే 101 పుస్తకాలు చదివి ప్రపంచంలోనే అతి పినవయస్కుడిగా రికార్డులకెక్కాడు. వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు లిఖించుకున్నాడు.. దేవాన్ష్ ప్రపంచంలో అందరూ తమ కుటుంబమే అంటున్నాడు.తన వల్ల అయ్యే సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిన్నతనంలోనే గొప్ప సేవా తత్పరత కలిగిన దేవాన్ష్ 72 గంటల పాటు చేసిన నిర్విరామ సేవ అతడికి అద్భుతమైన అవార్డు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ద ప్రెసిడెంట్ వాలంటరీ సర్వీస్ అవార్డు అయిన.. రాష్ట్రపతి స్వర్ణ స్వచ్ఛంద సేవా పథకానికి దేవాన్ష్ ఎంపికయ్యాడు. ఇక మరో చిచ్చరపిడుగు అక్షర.. అన్న దేవాన్ష్ లాగే చదువులో ముందుండే అక్షర, క్రీడల్లోనూ మెరిక అనే చెప్పాలి. ఇటీవల జూన్ 30వ తేదిన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో యూఎస్ 250 వ వార్షికోత్సవంలో మోస్ట్ స్టికర్స్ ఆన్ ద ఫేస్ అనే కాంపిటిషనలో పాల్గొని ఏకంగా తన ముఖంపై 63 స్టికర్లు అంటించుకుని విజేతగా నిలిచింది. సేవా గుణంలో అన్నను స్పూర్తిగా తీసుకున్న అక్షర.. వాలంటరీ సర్వీస్ లో తానూ తక్కువేమీ కాదని నిరూపించింది. తను కూడా రాష్ట్రపతి స్వర్ణ స్వచ్ఛంద సేవా పథకం గెల్చుకుంది. తమ కృషి ఫలించి పిల్లలిద్దరూ రాణించడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర తల్లిదండ్రులు కూడా పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా వారిలోని టాలెంట్ ని గుర్తించి వారితో కొంత సమయం కేటాయిస్తే అందరు పిల్లలు కూడా మంచి ప్రయోజకులు అవుతారని సూచిస్తున్నార. చిన్న తనంలోనే ఇన్ని గొప్ప పనులు చేస్తున్న ఈ అన్నా చెల్లెలు.. తమ తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూ తమ కోసం తన తల్లి చేసిన త్యాగం వృథా కానివ్వకుండా మరెన్నో శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్
ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

