నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వృద్ధాప్య తల్లిదండ్రులను వేధించిన ఓ యువకుడికి నెల రోజుల జైలు శిక్ష విధించింది. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన విజయవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని వేధిస్తున్నాడు. గ్రామస్థులు, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, న్యాయస్థానం సాక్ష్యాధారాలు పరిశీలించి తీర్పునిచ్చింది.