AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ శుభవార్త.. కొత్త ఆప్షన్ వచ్చేసింది.. నిమిషంలోనే సమస్యకు పరిష్కారం

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇప్పుడు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎఫ్ చందాదారులకు ఊరట కలిగించింది. అసలు ఈ ఫీచర్ ఏంటి.. ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ శుభవార్త.. కొత్త ఆప్షన్ వచ్చేసింది.. నిమిషంలోనే సమస్యకు పరిష్కారం
Epfo
Venkatrao Lella
|

Updated on: Apr 15, 2026 | 8:45 AM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు మరో కొత్త సదుపాయం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి మీ యూఏఎన్ నెంబర్‌తో లింక్ అయిన తప్పుడు ఐడీలను మీరు తొలగించుకోవచ్చు. వీటిని సులువుగా డీలింక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈ సౌకర్యాన్ని పొడిగించాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించగా.. దీనికి సంబంధించి తాజాగా ఓ సర్కూలర్ కూడా జారీ చేసింది. ఈ సర్క్యూలర్ ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారుడికి తెలియకుండా ఏ కంపెనీ అయినా తప్పుగా ఐడీ క్రియేట్ చేస్తే దానిని తొలగించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్ సైట్లోకి వెళ్లి డీలింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారుడు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇందులో చూద్దాం.

ఎలా తొలగించుకోవాలి..?

-ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లండి

-యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వండి

-వ్యూ ఆప్షన్ ఎంచుకుని సర్వీస్ హిస్టరీని చెక్ చేయండి

-మీ యూఏఎన్ నెంబర్‌కు లింక్ అయిన ఐడీలు అన్నీ కనిపిస్తాయి

-కంపెనీ పేరు, మీరు ఆ కంపెనీలో చేరిన తేదీ, కంపెనీ నుంచి బయటకు వచ్చిన తేదీ వివరాలు కనిపిస్తాయి

-మీరు ఏ కంపెనీని అయితే తీసివేయాలనుకుంటన్నారో ఆ కంపెనీ పక్కన ఉండే డీలింక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-దానిని మీరు తిసివేయవచ్చో లేదా సిస్టమ్ ఆటోమేటిక్‌గా చెబుతుంది

-క్లెయిమ్ పెండింగ్‌లో ఉన్నా లేదా ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే ఎర్రర్ అని వస్తుంది

-అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది

కంపెనీ రిజెక్ట్ చేస్తే..

ఒకవేళ కంపెనీ మీ రిక్వెస్ట్‌ను రీజెక్ట్ చేస్తే స్థానిక ఈపీఎఫ్‌వో కార్యాలయానికి పంపబడుతుంది. అక్కడ అధికారులు పరిశీలించి అనంతరం ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటివి చేస్తారు. కంపెనీ రిజెక్ట్ చేసినా లేదా రెండు వారాల్లోపు ఎటువంటి సమాధానం రాకపోయినా, ఐడీ రెండు నుంచి ఆరుసార్లు క్రెడిట్ చేయబడి ఉన్నా ప్రాంతీయ కార్యాలయానికి వెళుతుంది. అయితే మీరు తొలగించాలనుకున్న మెంబర్ ఐడీపై విత్ డ్రా రిక్వెస్ట్ ఉన్నా, క్లెయిమ్ పెండింగ్‌లో ఉన్నా, ఆరు కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్నా మీరు డీలింక్ చేయలేరు. దీంతో ముందే వాటిని పరిశీలించుకుని రిక్వెస్ట్ పెట్టండి. లేకపోతే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యూఏఎన్ నెంబర్‌తో తప్పుడు ఐడీలు క్రియేట్ అవ్వడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. దీంతో ఈపీఎఫ్‌వో డీలింక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వాారా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సులువుగా ఆన్‌లైన్ ద్వారా ఈ పని చేయవచ్చు.

Follow Us