AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. అవన్నీ ఫ్రీ.. త్వరలోనే అమలుకు సిద్దం..

ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురుకురాలు, ఆశ్రమ పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. వీరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దం ప్రభుత్వం పెడుతోంది. ఈ క్రమంలో వారికి 11 రకాల మెడికల్ టెస్టులు చేయించనుంది. ఎయిమ్స్ వైద్యుల బృందం వీటిని చేయనుంది.

Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. అవన్నీ ఫ్రీ.. త్వరలోనే అమలుకు సిద్దం..
Andhra [pradesh
Venkatrao Lella
|

Updated on: Apr 15, 2026 | 7:53 AM

Share

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త అందించింది. విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లల్లో ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 11 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించనుంది. అనంతరం ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయనుంది. గురుకులాలు, ఆశ్రమ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఉచిత వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ టెస్టుల అనంతరం విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రెడీ చేయనుంది.

మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ మెడికల్ టెస్టులు అనేది జరుగుతాయి. గుండె, జన్యు, మెటబాలిక్, రక్త సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పోషకాహర స్థితిని కూడా అంచనా వేయనున్నారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలతో హెల్త్ ప్రొపైల్ క్రియేట్ చేసి డేటా బేస్‌లో భద్రపరుస్తారు. విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని గుర్తించి తగిన చర్యలు చేపడతారు. చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించడం వల్ల దానిని త్వరగా నివారించవచ్చు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లు, గురుకురాల్లో చదివే విద్యార్థులకు ప్రతీ ఏడాది ఒకసారి బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా అనారోగ్య సమస్యల ఉన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారికి అంగన్ వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు.

పరీక్షలు ఎందుకంటే..?

గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు పోషకాహారలేమి, అంటువ్యాధులు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇక జన్యుపరంగా కూడా పలు సమస్యలు వస్తున్నాయి. దీంతో గుర్తించడంలో ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీని వల్ల విద్యార్థుల మరణాలు కూడా జరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. అయితే ఎయిమ్స్ డాక్టర్లు బృందం టెస్టులు చేసిన తర్వాత డేటా బేస్ సిద్దం చేయడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది. లక్షలాది మంది విద్యార్థుల హెల్త్ ప్రొపైల్ సిద్దం చేయడానికి చాలా టైమ్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Follow Us