AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

సీనియర్ హీరోయిన్ ఆమని తన సినీ ప్రస్థానం, శుభలగ్నం, మావిచిగురు చిత్రాలలోని కీలక అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె సహజ నటన, భావోద్వేగ పాత్రలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సరితతో అనుబంధం గురించి వివరించారు. పరిశ్రమలో నలుపు-తెలుపు రంగుపై వ్యాఖ్యలు, స్టార్ హీరోలతో పనిచేయలేకపోవడం వంటి సవాళ్లను ఆమె ప్రస్తావించారు.

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
Aamani
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 12:09 AM

Share

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, గుర్తుండిపోయే పాత్రలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. ముఖ్యంగా, శుభలగ్నం , మావిచిగురు చిత్రాలు తన కెరీర్‌లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆమె వివరించారు. ఆమని శుభలగ్నం సినిమాలోని తన గయ్యాలి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్ర సమాజంలో ఎంతటి ఇంపాక్ట్‌ను చూపించిందో తెలియజేశారు. “నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదా, అది యాక్టింగ్ అన్నప్పుడు చేయాలి కదా” అని ఆమె అన్నారు. ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందని, తాను ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం అనే పేరు వినపడుతుందని చెప్పారు. ఆ చిత్రంలోని జగపతి బాబుతో తన కాంబినేషన్, ఆ పాత్ర తీరుతెన్నుల గురించి ఆమని వివరంగా మాట్లాడారు. దర్శకుడు కృష్ణారెడ్డి గారు ఇటీవల ఫోన్ చేసి తన నటనను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆమని కెరీర్‌లో అత్యంత భావోద్వేగభరితమైన, నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం మావిచిగురు అని పేర్కొన్నారు. ఈ సినిమాలో పాత్రకు చాలా డెప్త్ ఉందని, నటించే సమయంలో ఎంతో కష్టపడ్డానని తెలిపారు. “ఆ ఒక్క రోజు చేశానంటే, ఆ రోజంతా వెళ్లి హెడ్ ఏక్ వస్తుంది. ఎందుకంటే ఎమోషన్స్ ఏడ్చి ఏడ్చి ఓవర్ స్ట్రెస్ అయ్యేది నాకు” అని ఆమె ఆ పాత్ర తీవ్రతను వెల్లడించారు. కన్నీళ్లకు గ్లిజరిన్ వాడకుండా, సహజంగా ఏడవడానికి ప్రయత్నించేదాన్నని, అది తనకు తలనొప్పిని తెచ్చిపెట్టేదని ఆమని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం, ఇప్పటికీ తనను వెంటాడుతుందని ఆమె అన్నారు.

చిత్ర పరిశ్రమలో తమ రంగు గురించి తాను, రోజా, సరిత వంటి నటీమణులు ఎదుర్కొన్న వ్యాఖ్యలను ఆమని ప్రస్తావించారు. “మేము వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు సావిత్రి గారు, వాణిశ్రీ గారు, రాధిక గారు, సరిత గారు వచ్చినప్పుడంతా కలర్ పెద్దగా అనేవారు కాదు. ఎక్కువ వాళ్ళే ఉండేవారు డస్కీ కలర్ వాళ్లే” అని అన్నారు. అయితే, నగ్మా, రంభ వంటి ఉత్తరాది నటీమణుల రాకతో రంగు, గ్లామర్‌కు ప్రాధాన్యత పెరిగిందని, అది తమ వంటి నటీమణులకు అవకాశాలు రావడానికి కష్టమైందని ఆమని అన్నారు. అయినప్పటికీ, జయసుధ, రాధిక, సరిత వంటి సహజ నటీమణులు తమ ప్రతిభతో ఎన్నో విజయాలు సాధించి, వారి డేట్స్ కోసం హీరోలు కూడా ఎదురుచూసే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.

ఆమని వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం మిస్సయిన విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి గారి సినిమా అవకాశం వచ్చి, సినిమా బుక్ అయ్యాక, డైరెక్టర్ మారడంతో ఆ అవకాశం చేజారిందని, తన స్థానంలో నగ్మా నటించారని తెలిపారు. అలాగే, చిరంజీవి గారి స్టాలిన్ సినిమాలో అక్క పాత్ర (ఖుష్బూ పోషించిన పాత్ర) కోసం తనను అడిగినా, చిరంజీవికి పక్కన హీరోయిన్‌గానే చేయాలని కోరుకోవడంతో ఆ పాత్రను తిరస్కరించినట్లు ఆమని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

Follow Us