AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నప్పుడే కెమెరాతో పోజులిచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ హీరోకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. నటన పట్ల కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. పైగా సినిమా కథల ఎంపికలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటికే హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

Tollywood: చిన్నప్పుడే కెమెరాతో పోజులిచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 9:33 PM

Share

పై ఫొటోలో చిన్నప్పుడే కెమెరా పట్టుకుని పోజులిస్తోన్న ఈ బుడతడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరో. సినిమా నేపథ్యమున్న ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట సినిమాలోనే విలన్ గా నటించి మెప్పించాడు. అయితే ఆ తర్వా సోలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లతో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఆ తర్వాత మాస్ హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ హీరో స్పెషాలిటీ ఏంటంటే.. ఎలాంటి ఈగోలకు పోడు. ఎలాంటి వివాదాల్లోనూ తల దూర్చడు. అందుకే ఇతర హీరోల సినిమాల్లోనూ తరచూ కనిపిస్తుంటాడు. హీరోగా నటిస్తూనే విలన్ గానూ, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటుంటాడు. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న ఈ హీరోకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. అందుకే తాను సంపాదించిన దాంట్లో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడు. మరి అందమైన మనసు ఉన్న ఈ ట్యాలెంటెడ్ హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సందీప్ కిషన్.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సిగ్మా. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 02) న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ కు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ హీరో ప్రముఖ కెమెరామేన్ చోటా కే నాయుడుకు మేనల్లుడు అవుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇక సిగ్మా విషయానికి వస్తే.. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. రాజు సుందరం, సంపత్‌ రాజ్‌ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజవుతోన్న సిగ్మా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సిగ్మా సినిమాలో సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ..!
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ..!
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..