Jabardasth: అన్నా ఇది నువ్వేనా! హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కొన్ని పాత ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు చెందిన త్రో బ్యాక్ ఫొటోస్, వీడియోస్ తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటాయి. అలా ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేనితో కలిసి ఒక జబర్దస్త్ కమెడియన్ దిగిన పాత ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పై ఫొటోలో హీరో రామ్ తో ఉన్న యువకుడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ కమెడియన్. 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాలా సినిమాల్లో నటించాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ తదితర స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అప్పట్లో ఒత్తైన జుట్టు.. మంచి హెయిర్ స్టైల్‌తో ఉన్న ఇతను హీరో అవుదామనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ సినిమాల్లో ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ రోల్స్ వచ్చాయి. దీంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితేనేం తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని పాత్రలు చేస్తూ పోయాడు. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడో ఈ నటుడి జీవితమే మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా నటించినా రానీ గుర్తింపు ఒక్క జబర్దస్త్ కామెడీ షోతో సొంతం చేసుకున్నాడు. ఈ కామెడీ షోలో తన దైన యాక్టింగ్, గెటప్పులతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా దర్శక కేంద్రుడు రాఘవేంద్ర రావు ను అనుకరిస్తూ బాగా హైలెట్ అయ్యాడీ కమెడియన్. ఒక షోలో రాఘవేంద్ర రావు గెటప్పులో ఇతనిని చూసి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్న ఈ కమెడియన్ మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ గడ్డం నవీన్.
కాగా జబర్దస్త్ లోకి రాక ముందు పలు సినిమాల్లో నటించారు నవీన్. రామసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, నాగ, బ్యాడ్ బాయ్స్ తదితర హిట్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో తళుక్కుమన్నారు. ఎక్కువగా విలన్ గ్యాంగ్స్ లోనే కనిపించిన ఆయన అదిరే అభి, చలాకీ చంటి సహాయంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. ముఖ్యంగా అదిరే అభి టీమ్ లో అభి, రాముతో కలిసి నవీన్ చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇక పై ఫొటో విషయానికి వస్తే.. హీరో రామ్ పోతినేని నటించి మొదటి సినిమా దేవదాసు టైమ్ లో తీసుకున్నదని తెలుస్తోంది.
కాగా సినిమాల్లో అవకాశాలు వస్తుండడంతో నవీన్ ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. కేవలం స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే సందడి చేస్తున్నాడు. మరోవైపు సినిమాల్లో మాత్రం కమెడియన్ గా, సహాయక నటుడిగా రాణిస్తున్నాడు. దీంతో పాటు నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. ఆ మధ్యన తన తోటి కమెడియన్, టీమ్ లీడర్ అదిరే అభి హీరోగా పాయింట్ బ్లాంక్ సినిమా నిర్మించారు.
అదిరే అభితో జబర్దస్త్ నవీన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




