AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ లేటస్ట్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగుతో సహా 5 భాషల్లో స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా జస్ట్ ఓ మోస్తరుగా ఆడింది. అయితే థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ లేటస్ట్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగుతో సహా 5 భాషల్లో స్ట్రీమింగ్
Sardar 2 Movie
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 6:36 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2. సుమారు నాలుగేళ్ల క్రితం (2022)లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సర్దార్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన దర్శకుడు పీఎస్ మిత్రనే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించాడు. కార్తీ సరసన మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు నటించారు. అలాగే విలక్షణ నటుడు ఎస్జే సూర్య విలన్ గా నటించడం విశేషం. ఇలా స్టార్ క్యాస్టింగ్ కు తోడు గ్లింప్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందు సర్దార్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే హీరో కార్తీ, ఎస్జే సూర్య భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. అయితే తీరా థియేటర్లలోకి అడుగు పెట్టాక సర్దార్ 2 అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. తమిళంలో ఓ మాదిరి కలెక్షన్లు వచ్చినప్పటికీ తెలుగులో ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే ఉన్నంతలో డబుల్ రోల్ లో కార్తీ నటన, ఎస్జే సూర్య విలనిజం అభిమానులను మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని సర్దార్ 2 సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

సర్దార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అక్టోబర్ 01 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సర్దార్ 2 సినిమా అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో సర్దార్ 2..

ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ఎస్.లక్ష్మణ్ కుమార్ సర్దార్ 2 సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు యోగిబాబు, రజీషా విజయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని సర్దార్ 2 ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి

సర్దార్ 2 సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో
పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో
'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే
ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన