AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rithu Chowdary: మా బంధం ముగిసిపోయింది.. డీమాన్ పవన్- రీతూ చౌదరీల బ్రేకప్.. అసలు ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ జోడీకి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ జోడీ బ్రేకప్ చెప్పుకున్నారు.

Rithu Chowdary: మా బంధం ముగిసిపోయింది.. డీమాన్ పవన్- రీతూ చౌదరీల బ్రేకప్.. అసలు ఏం జరిగిందంటే?
Demon Pavan, Rithu Chowdary
Basha Shek
|

Updated on: Sep 30, 2026 | 6:37 AM

Share

బిగ్ బాస్ జోడీగా, సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ పెయిర్‌గా గుర్తింపు పొందిన రీతూ చౌదరి ,డీమోన్ పవన్ జంట తమ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని రోజులుగా తమ మధ్య విభేదాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, పవన్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇకపై తమ మధ్య ఉన్న స్నేహ బంధం కూడా పూర్తిగా ముగిసిపోయిందని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు పవన్. తాము ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నామని, బ్లాక్ కూడా చేసుకున్నామని పవన్ పేర్కొన్నాడు. ‘రీతూ చౌదరితో సంబంధంపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీ, ఫేక్ రూమర్లు దారుణంగా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో కనిపించేది, నిజ జీవితంలో జరిగేది రెండు వేర్వేరు విషయాలు. మేమిద్దరం ఎవరూ ఎవరినీ వాడుకోలేదు. అది ఒక పరస్పర స్నేహబంధం. అయితే గత కొన్ని నెలలుగా మా మధ్య వ్యక్తిగత సమస్యలు, తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో మనశ్శాంతి కోసం ఇద్దరం విడివిడిగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మేమిద్దరం ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నాం. అలాగే బ్లాక్ లిస్టులో కూడా చేర్చుకున్నాం.’

‘రీతూ చౌదరి వాట్సాప్, స్నాప్‌చాట్‌లో నన్ను బ్లాక్ చేసింది. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఆమెను తీసివేశాను. ఆ తర్వాత రీతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను బ్లాక్ చేసింది. అయితే నేనేతై ఎలాంటి పాత పోస్టులను డిలీట్ చేయలేదు.ఇకపై రివాన్ అనే కాంబినేషన్ ఉండదు. మా మధ్య ఉన్న స్నేహం బంధం కూడా పూర్తిగా తెగిపోయింది. నెటిజన్లు కూడా అనవసరమైన ఊహాగానాలు ఆపి మా ప్రైవసీని గౌరవించాలి. మాకు కొంచెం మానసిక ప్రశాంతతను అందించాలని కోరుకుంటున్నాను’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు డీమాన్ పవన్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎంతో క్యూట్‌గా ఉంటూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ వీడియోలు చేసిన ఈ పాపులర్ బిగ్ బాస్ జోడీ ఉన్నట్లుండి విడిపోవడం పట్ల వారి అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరి మధ్య ఏం జరిగింది? అంటూ ఆరా తీస్తున్నారు.

Demon Pavan, Rithu Chowdary

Demon Pavan, Rithu Chowdary

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us