AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ

ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి (అక్టోబర్01) ని పురస్కరించుకుని మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ దిగ్గజ నటునికి నివాళులు అర్పించారు. మరోసారి ఆయన సేవలను స్మరించుకన్నారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
Allu Arjun Family
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 10:25 PM

Share

ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి (అక్టోబర్01)ని మెగా, అల్లు కుటుంబీకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు కూడా అల్లు రామలింగయ్య సేవలను స్మరించుకున్నారు. ఇదే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యామిలీ సరి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. అదేంటంటే.. తనకెంతో ఇష్టమైన తాతయ్య జయంతి సందర్భగా కొత్త కార్యాలయానికి శ్రీకారం చుట్టారు బన్నీ. ఐకాన్‌జా పేరుతో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జునే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలో అల్లు అరవింద్ దంపతులు, చిరంజీవి సతీమణి సురేఖ, శిరీష్-నైనిక, అల్లు వెంకటేష్ దంపతులు కనిపించారు. ప్రస్తుతం బన్నీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగా, అల్లు అభిమానులు, నెటిజన్లు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతోంది. త్వరలోనే ఈ మూవీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us