AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Intake: మీరు వాటర్ తక్కువ తాగుతున్నారని చెప్పే లక్షణాలు ఇవే.. లైట్‌ తీసుకుంటే అంతే!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే గాలీ, ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే కచ్చితంగా నీరు కావాల్సిందే. కాబట్టి రోజూ మన శరీరానికి అవసరమైన మేర నీరు కచ్చితంగా తీసుకోవాలి. అయితే వయస్సు, శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని మనం తీసుకునే నీటి క్వాంటిటీ కూడా మారుతుంది. కాబట్టి ఏ సీజన్‌లో ఎన్ని నీళ్లు తాగాలో ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 22, 2026 | 6:14 PM

Share
మన పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మన శరీరానికి అవసరమైనన్ని నీరు కచ్చితంగా తాగాల్సి ఉంటుంది. నీరు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరమంతటా పోషకాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలోని ప్రతి అవయవం తన విధిని సరిగ్గా చేయడానికి ఈ నీటిని వాడుకుంటుంది. కాబట్టి మళ్లీ మనం వాటిని బర్తీ చేయాల్సి ఉంటుంది.

1 / 5
అయితే ఈ బర్తీ చేయాల్సిన నీటి పరిమాణం అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి వయస్సు, శరీర బరువు, శారీరక శ్రమ, వాతావరణాన్ని బట్టి వారి నీటి అవసరం కూడా మారుతూ ఉంటుంది. సాధారణంగా, ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు సుమారు 2 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. అయితే కేవలం నీటితో మాత్రమే కాకుండా ఇతర ఆహారాలు, పానియాల ద్వారా కూడా నీరు అందుతుంది. కాబట్టి తీసుకునే క్వాంటిటీని కరెక్ట్‌గా తెలుసుకోవడం ముఖ్యం.

2 / 5
సాధారణంగా వేడి వాతావరణం ఉన్నప్పుడు శరీరానికి ఎక్కవగా చెమట పడుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న నీరు చుమల రూపంటో బయటకు వెళ్తొంది. కాబట్టి బాడీ డీహైడ్రెట్‌ అవుతుంది. ముఖ్యంగా ఎండలో పనిచేసేవారు. జిమ్‌లో వర్కౌట్స్ చేసే వారికి ఎక్కవ చెమలు వస్తాయి. కాబట్టి వారికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఇలాంటి వ్యక్తులు దాహం వేసే వరకు వేచి చూడకుండా నీటిని తాగాల్సి ఉంటుంది.

3 / 5
లేకపోతే శరీరంలో నీటి శాతం తగ్గి నోరు పొడిబారిపోవచ్చు.మూత్రం సాధారణం కంటే తక్కువగా రావచ్చు లేదా ముదురు పసుపు రంగులో ఉండవచ్చు. అంతేకాదు శరీరానికి సరపడా నీరు తాగకపోతే తలనొప్పి, అలసట, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు మీరు విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

4 / 5
అలా అని ఒకేసారి ఎక్కువ నీరు తాగడం కూడా కరెక్ట్‌ కాదు.. కొద్ది కొద్దిగా నీటిని తీసుకోవడం మంచింది. అంతేకాదు మీరు చేసే పనిని బట్టి మీ శరీరంలో వాటర్ కంటెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి మీ అసవరానికి తగ్గటు రోజూ 3-4 లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోండి.. మీరు ఎండలో పనిచేస్తుంటే ఒక ఆఫ్ లీటర్ ఎక్కవ తాగినా ఏం కాదు.. మూత్రపిండాలు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులు కచ్చితంగా వైద్యుల సలహా మేరకు నీటిని తాగాలి.

5 / 5
Follow Us