ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి వంగ వంశీ చివరి కోరికను పదేళ్ల కుమార్తె బిందు శ్రీ ధైర్యంగా తీర్చింది. సంప్రదాయాలను పక్కనబెట్టి, కూతురే తండ్రి అంత్యక్రియలు నిర్వహించి, చితికి నిప్పంటించి అందరినీ కంటతడి పెట్టించింది. ఇది మారిన కాలానికి నిదర్శనం.