తిప్పరా మీసం.. మన హీరోల మాస్ ప్రయోగం..!
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు శక్తివంతమైన ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్ కోసం కోర మీసాల లుక్‌ను ఎంచుకుంటున్నారు. ఇది పాత ట్రెండ్‌ను పక్కన పెట్టి మాస్ వైబ్రేషన్స్‌ను అందిస్తోంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా, ఈ లుక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కొత్త సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. చిరంజీవి నుండి నాని వరకు, యువ హీరోలు సైతం ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పవర్‌ఫుల్ ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్ కోసం సరికొత్త కోర మీసాల లుక్ వైపు అడుగులేస్తున్నారు. పాత ట్రెండ్‌ను పక్కన పెట్టి, మాస్ వైబ్రేషన్స్ ఇచ్చే ఈ లుక్‌తో ఆడియన్స్‌కు కిక్కిస్తున్నారు. సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా, కేవలం ఆ మీసాల లుక్స్‌తోనే సోషల్ మీడియాను షేక్ చేస్తూ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాలో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే లుక్ విషయంలో కొత్తదనం ఉండాలని మన హీరోలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఏది ట్రై చేసినా రాని ఆ మాస్ ఫీల్ ఒక కోర మీసం పెంచితే వస్తుందని స్టార్స్ గట్టిగానే ఫిక్స్ అయ్యారు. ఇదే ట్రెండ్‌ను సీనియర్ హీరోలైన చిరంజీవి కాకా సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కోర మీసంతో కనిపించనున్నారు. అలాగే, బాలకృష్ణ సైతం దాదా సినిమాలో పవర్‌ఫుల్ మీసాలతో కనిపిస్తున్నారు. సీనియర్లే కాకుండా, టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ సిల్వర్ స్క్రీన్ మీద తమ మీసాలు తిప్పుతున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం, రవితేజ మాస్ జాతర కోసం అదిరిపోయే కోర మీసాలతోనే కనిపించి మ్యాజిక్ చేశారు. అలాగే, విజయ్ దేవరకొండ కూడా రణబలిలో ఇదే పవర్‌ఫుల్ లుక్‌తో కనిపించి సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కేవలం యాక్షన్ హీరోలే కాకుండా, నాని ప్యారడైజ్ మూవీ కోసం, శర్వానంద్ భోగి సినిమా కోసం కోర మీసాలు పెంచి మాస్ అప్పీల్ తీసుకొచ్చారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా, ఫ్యాన్స్‌కు మాత్రం మన హీరోల మీసాల లుక్స్ బాగా కనెక్ట్ అయిపోయి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, ఒక పర్ఫెక్ట్ రస్టిక్ అండ్ పవర్‌ఫుల్ లుక్ కోసం కోర మీసాలే బెస్ట్ ఆప్షన్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే
Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే
పుట్టగానే పుష్ప అంటున్న బుడ్డోడు! చిన్నారి వీడియో వైరల్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

