AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సవతి తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించిన సవతి కొడుకు.. సజీవంగా దహనమైన మహిళ

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సవతి కొడుకు డీజిల్ పోసి నిప్పంటించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల సుష్మా దేవి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె శరీరంలో దాదాపు 70 శాతం కాలిన గాయాలయ్యాయి. తొలుత ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి, అనంతరం జమ్మూలోని GMC ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు..

సవతి తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించిన సవతి కొడుకు.. సజీవంగా దహనమైన మహిళ
Udhampur Woman Death
Srilakshmi C
|

Updated on: Oct 22, 2026 | 6:09 PM

Share

ఉధంపూర్, అక్టోబర్ 22: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోనే సవతి కొడుకు డీజిల్ పోసి నిప్పంటించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమెను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (GMC)కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఉధంపూర్‌లోని హౌసింగ్ కాలనీకి చెందిన కేశవ్ వర్మ భార్య సుష్మా దేవిగా గుర్తించారు. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో ఉండగా, సవతి కొడుకు మోక్ష్ వర్మ డీజిల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సుష్మా దేవి శరీరంలో దాదాపు 70 శాతం కాలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

మంటల్లో చిక్కుకున్న మహిళ కాపాడాలంటూ కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆమెను రక్షించేందుకు పొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఉధంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు మోక్ష్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. సవతి తల్లిపై దాడికి పాల్పడటానికి గల కారణాలేమిటన్న కోణంలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో ఈ వీడియో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Follow Us