AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simran : స్టార్ హీరోయిన్ కావాల్సిన సిమ్రాన్ చెల్లెలు.. 21 ఏళ్ల వయసులోనే ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా.. ?

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని బాలకృష్ణ, మహేష్ బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. సిమ్రాన్ చెల్లెలు సైతం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. కెరీర్ ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె కేవలం 21 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. అందుకు కారణం ఏంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Oct 22, 2026 | 6:24 PM

Share
టాలీవుడ్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగు భాషలలో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది.  అయితే సిమ్రాన్ చెల్లెలి గురించి చాలా మందికి తెలియదు. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి జోడిగా బద్రి చిత్రంలో కథానాయికగా నటించి అందరి హృదయాలు గెలుచుకుంది. ఆమె పేరు మోనాల్. కేవలం రెండేళ్లలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

1 / 5
మోనాల్ హిందీతోపాటు పలు భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. అయితే కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ 21 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఆమె మరణవార్త ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె అనుహ్య మరణం ఇప్పటికీ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక జ్ఞాపికగా, రహస్యంగా మిగిలిపోయింది.

2 / 5
మోనాల్ 2002లో ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. సిమ్రాన్ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే మోనాల్ సైతం నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ముంభైలో కళాశాల విద్యను పూర్తి చేసిన మోనాల్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు ఫ్యాషన్ షోలు చేసింది. అప్పట్లోనే ఆమె  'మిస్ బాంబే' కిరీటాన్ని గెలుచుకుంది.

3 / 5
ఆమె ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ అకాడమీలో నటనలో శిక్షణ కూడా పొందింది. సిమ్రాన్‌తో పాటు, ఆమెకు జ్యోతి సుమీత్ అనే మరో ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. శివరాజ్‌కుమార్ నటించిన 'ఇంద్రధనుష్' (2000) చిత్రంతో నటిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత 'పార్వై ఒంట్రే పోతుమే' (2001) చిత్రంతో తమిళ చిత్రసీమలో ప్రవేశించింది. కానీ విజయ్ జోడిగా నటించిన బద్రి సినిమాతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె 'లవ్లీ' (2001), 'సముద్రం' (2001), 'మా తుఝే సలామ్' (2002), 'చార్లీ చాప్లిన్' (2002), 'పెసతా కన్నుమ్ పెసుమే' (2002) వంటి చిత్రాలలో నటించింది.

4 / 5
మోనాల్ 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించింది. ఆ మరణం తరువాత, నటి సిమ్రాన్ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, మోనల్ మాజీ ప్రియుడు ప్రసన్న వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించింది. వారిద్దరూ కలిసి జీవించారని, ప్రసన్న ఆ సంబంధాన్ని ముగించడమే తన సోదరి కఠిన వైఖరి తీసుకోవడానికి కారణమైందని సిమ్రాన్ ఆరోపించింది. మోనల్ మరణానంతరం విడుదల చేసిన తమిళ థ్రిల్లర్ 'అధికం' (2005).

5 / 5
Follow Us