AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత ఘటన.. నోటిలో పెరగాల్సిన పన్ను కంటి పైన..!

సాధారణంగా నోటిలో పెరగాల్సిన పన్ను.. ఓ 16 ఏళ్ల బాలుడి కంటి దగ్గర పెరిగింది. ఈ విషయం తెలిసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. కంటి గుంట పైభాగంలో పన్ను పెరగడం ప్రపంచంలోనే ఇదే తొలి ఘటనగా వైద్యులు చెబుతున్నారు. ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ వైద్య జర్నల్‌లో ప్రచురితమైంది.

వింత ఘటన.. నోటిలో పెరగాల్సిన పన్ను కంటి పైన..!
Teen From Tamilnadu Records First Case Of An Ectopic Tooth Growing Out Of An Eye
Sharada V
|

Updated on: Oct 22, 2026 | 4:48 PM

Share

సాధారణంగా నోటిలో పెరగాల్సిన పన్ను.. 16 ఏళ్ల బాలుడి కంటి దగ్గర పెరిగింది. ఈ విషయం తెలిసి  వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. కంటి గుంట పైభాగంలో పన్ను పెరగడం ప్రపంచంలోనే ఇదే తొలి ఘటనగా వైద్యులు చెబుతున్నారు. ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ వైద్య జర్నల్‌లో ప్రచురితమైంది.

కనురెప్పపై వాపు

తమిళనాడుకి చెందిన బాలుడికి ఎడమ కంటి పై భాగంలో ఓ నెల రోజులు వాపు కనిపించింది. మొదట్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. దాంతో సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజులకే కనురెప్ప చర్మం నుంచి రెండు తెల్లటి మొనల్లాంటివి బయటకు చొచ్చుకొచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించినప్పుడు ఆ భాగం రంగు, గట్టితనాన్ని చూడగా పన్నుగా అనుమానించారు. స్కానింగ్ లో వారి అనుమానం నిజమైంది. బాలుడి కనుబొమ్మకు, కనురెప్పకు మధ్య కంటి గుంటలో పూర్తిగా పెరిగిన పన్ను ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడులోని అరవింద్ ఐ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు శస్త్రచికిత్స చేసి బాలుడి కంటి పై పెరిగిన పంటిని విజయవంతంగా తొలగించారు.

అసలు సమస్య ఏమిటి?

శరీరంలో పళ్లు సాధారణంగా పెరగాల్సిన నోటి భాగాన్ని వదిలి, వేరే ప్రాంతంలో పెరగడాన్ని వైద్య పరిభాషలో ఎక్టోపిక్ టూత్ (Ectopic Tooth) అంటారు. ముక్కు వెనుక భాగంలో గాలితో నిండిన ఖాళీ ప్రదేశం మాక్సిల్లరీ సైనస్‌లో, నోటి పై కప్పు ప్రాంతాల్లో (palette) అదనపు పళ్లు పెరగడం కొన్ని కేసుల్లో కనిపిస్తుంది. అయితే కంటి గుంటలో (superior orbit) పన్ను పెరగడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటి కేసు అని అరవింద్ ఐ హాస్పిటల్‌ డాక్టర్‌ మేఘనా తన్వర్‌ తెలిపారు.

ప్రపంచంలోనే తొలి కేసు!

సాధారణంగా ముఖానికి బలమైన గాయం తగిలినప్పుడు లేదా జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఈ బాలుడికి గతంలో ఎలాంటి గాయాలు కాలేదు. కుటుంబంలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించలేదు. అతడి శరీరంలో మరెక్కడా అదనపు పళ్లు కూడా లేవు. కేవలం కంటి దగ్గర మాత్రమే ఒక పన్ను పెరగడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడి కంటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్యులు శస్త్రచికిత్స చేసి పన్ను తొలగించారు.  మొత్తానికి అరుదైన ఘటనగా ప్రపంచ వైద్య చరిత్రలో నమోదైంది.

Follow Us