AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్కడ దీపావళికి ఏకంగా 2 వారాల పాటు స్కూళ్లకు సెలవులు!

దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు దాదాపు రెండు వారాల పాటు సెలవులు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవులను పేర్కొంటూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పండుగ ఏర్పాట్లను ముందుగానే చేసుకునే అవకాశం లభించనుంది..

విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్కడ దీపావళికి ఏకంగా 2 వారాల పాటు స్కూళ్లకు సెలవులు!
Maharashtra Announces Diwali School Vacation Dates
Srilakshmi C
|

Updated on: Oct 22, 2026 | 6:21 PM

Share

మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందించింది. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు దాదాపు రెండు వారాల పాటు సెలవులు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవులను పేర్కొంటూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పండుగ ఏర్పాట్లను ముందుగానే చేసుకునే అవకాశం లభించనుంది. మహారాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు నవంబర్ 2, 2026 నుంచి నవంబర్ 14 వరకు దీపావళి సెలవులు ఉండనున్నాయి. ఈ తేదీల మధ్య వచ్చే ఆదివారాలను కలుపుకుంటే విద్యార్థులకు వరుసగా దాదాపు రెండు వారాల పాటు విరామం లభించనుంది. ధనత్రయోదశి, దీపావళి పాడ్వా, భాయ్ దూజ్ వంటి పండుగలు కూడా ఈ సెలవుల సమయంలోనే రావడంతో విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు వీలుంటుంది.

నవంబర్ 16 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు

విద్యా క్యాలెండర్ ప్రకారం.. మొదటి సెమిస్టర్ జూన్ 15న ప్రారంభమై అక్టోబర్ 31తో ముగియనుంది. దీపావళి సెలవులు పూర్తయిన తర్వాత నవంబర్ 16, సోమవారం నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రెండో సెమిస్టర్ 2027 మే 1 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2027 మే 3 నుంచి జూన్ 14 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సెలవుల షెడ్యూల్‌తో పాటు పాఠశాలల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ కొన్ని నిబంధనలను కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. సెకండరీ స్కూల్ కోడ్ ప్రకారం.. విద్యా సంవత్సరంలో మొత్తం సెలవులు 76 రోజులకు మించకూడదని, పాఠశాలలు కనీసం 230 పనిదినాలను పూర్తి చేయాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అలాగే పాఠశాలలు తమకు అనుకూలంగా సెలవుల తేదీలను స్వయంగా మార్చుకోవడానికి వీలుండదు. స్థానిక పండుగలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల కోసం సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేయాలంటే సంబంధిత విద్యాశాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దీపావళి సెలవుల తేదీలు ముందుగానే ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ ప్రయాణాలు, కుటుంబ వేడుకలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో నివసించే బంధువుల వద్దకు వెళ్లాలనుకునే కుటుంబాలకు ఈ విరామం ఉపయోగపడనుంది.

Follow Us