Ranabaali: రాయలసీమ గడ్డపై ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే? పూర్తి వివరాలివే
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించనుంది.

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రణబాలి సినిమా బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడం విశేషం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన రణబాలి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభిమానులకు మరో శుభవార్తను అందించింది. రణబాలి సినిమా విజయాన్ని పురస్కరించుకుని గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు సమీపంలో ఉన్న హార్మోని సిటీలో ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. శుక్రవారం (అక్టోబర్ 23న) సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాతో పాటు చిత్ర బృందమంతా తరలిరానుందని తెలుస్తోంది. సినిమా విజయాన్ని అభిమానులతో కలిసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఇక రణబాలి సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అజయ్–అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
రేపే రాప్తాడులో రణబాలి గ్రాండ్ సక్సెస్ ఈవెంట్..
Get ready for #RANABAALI RANABHERI – a grand event at Anantapur ❤🔥
On 23rd October, from 5 PM onwards at Harmony City, Rapthadu Road, Anantapur 🔥
#Ranabaali RUNNING SUCCESSFULLY IN CINEMAS 💥💥
Book your tickets now! 🎟️ https://t.co/xemq93hZUF
#Ranabaali #ConqueringCinemas
— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




