AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kichcha Sudeep: ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు.. మళ్లీ ఎలా ఒక్కటయ్యారో తెలుసా?

కన్నడ స్టార్ హీరో, బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ తాజాగా తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సుదీప్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో సుదీప్ దంపతుల గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Kichcha Sudeep: ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు.. మళ్లీ ఎలా ఒక్కటయ్యారో తెలుసా?
Kiccha Sudeep Family
Basha Shek
|

Updated on: Oct 22, 2026 | 8:00 AM

Share

కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియ తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో సుదీప్ , ప్రియ ఒకరికొకరు పూలమాలలు వేసుకుంటూ కనిపించారు. అలాగే సుదీప్ తన భార్య ప్రియతో సరదాగా గడుపుతూ కనిపించారు. దీంతో పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుదీప్- ప్రియ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుదీప్ దంపతుల గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఒకానొక సమయంలో కిచ్చా సుదీప్ , ప్రియ విడాకుల వరకు వెళ్లారు . ఈ జంట 2015లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు , కానీ తర్వాత తమ మనసు మార్చుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కిచ్చా సుదీప్ , ప్రియ అక్టోబర్ 18, 2001న వివాహం చేసుకున్నారు . ఈ దంపతులకు సాన్వి సుదీప్ అనే కుమార్తె ఉంది. పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, 2015లో వారి సంబంధంలో మనస్పర్థలు తలెత్తాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుదీప్ ఒక నిర్ణీత మొత్తంలో భరణం చెల్లించడానికి, అలాగే తమ కుమార్తె సంరక్షణ బాధ్యతను ప్రియకు అప్పగించడానికి కూడా అంగీకరించారు. అయితే ఆ తర్వాత దంపతులిద్దరూ తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవడంతో విడాకుల ప్రక్రియ ముందుకు సాగలేదు.

సుదీప్, ప్రియ 2017లో తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుని, తమ బంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక కోర్టులో ఇద్దరూ కలిసి జీవించడానికి లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపారు. అలా విడాకుల వరకు వెళ్లిన దంపతులు ఇప్పుడు మళ్లీ అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. కాగా పెళ్లి వేడుకలో సుదీప్ పూలతో అలంకరించిన తన తల్లి సరోజా సంజీవ్ పెద్ద ఫోటోను ఉంచడం గమనార్హం.. నటుడి తల్లి సరోజ, 86 ఏళ్ల వయసులో 2024 అక్టోబర్ 20న కన్నుమూశారు . ఇదిలా ఉండగా , కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి . ఆయన ‘బిల్లా రంగ భాష’, ‘మార్క్’, ‘స్కూల్ బస్’ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఆయన ‘కేకే’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాకు దర్శకుడిగా కూడా పనిచేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల్లో కిచ్చా సుదీప్ దంపతులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం
పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం
కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!
కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!
ఓటీటీలోకి వచ్చేసిన నాని సూపర్ హిట్ సినిమా 'ది ప్యారడైజ్'
ఓటీటీలోకి వచ్చేసిన నాని సూపర్ హిట్ సినిమా 'ది ప్యారడైజ్'
ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..