AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. ఓటీటీలో ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూశారా? తెలుగులోనూ ఉంది

కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీలోనూ చాలా రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. ఓటీటీలో ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూశారా?  తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 09, 2026 | 10:12 PM

Share

ఈ మధ్యన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు కూడా వస్తున్నాయి. కల్పిత కథలతో కూడిన సినిమాల కంటే ఈ రియల్ స్టోరీలను చూసేందుకు ఆడియెన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినదే. కేరళలో జరిగిన ఓ నరమేధం ఆధారంగా ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను రూపొందించారు. 2003లో ముత్తంగ అనే ఆదివాసీ లు తమ భూ హక్కుల కోసం చేసే పోరాటం, దానిని పోలీసులు అత్యంత క్రూరంగా అణచివేసిన తీరును ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. కథ మొత్తం వర్గీస్ అనే ఒక CRPF కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అతని సహోద్యోగి ఓ గిరిజన ప్రాంతంలో కనిపించకుండా పోవడంతో పరిస్థితులు ఊహించని మలుపు తీసుకుంటాయి. దీంతో ఆ ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వర్గీస్ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇదే క్రమంలో ఆది వాసీలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, వారిని అక్కడి నుంచి తరిమేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాడు. మరి వర్గీస్ చేసిన పోరాటం ఫలించిందా? లేదా? అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ రియల్ స్టోరీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈమూవీకి 6.5 రేటింగ్ దక్కడం విశేషం. ఓటీటీలో ఉన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటని చెప్పవచ్చు. తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న మలయాళం నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు నరివెట్ట. తెలుగులో నక్కల వేట గా రిలీజైంది. నురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథను అబిన్ జోసెఫ్ అందించాడు. మరో సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడు ఈ మూవీలో మరో కీలక పాత్ర పోషించాడు. అలాగే చేరన్‌, ఆర్య సలీమ్‌, ప్రణవ్‌, ప్రియంవద కృష్ణన్‌ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి కంటెంట్ బేస్డ్ మూవీ చూడాలనుకునేవారికి నరివెట్ట మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

నరివెట్ట సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం
తెలుగులో తోప్ హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకుంది..
తెలుగులో తోప్ హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకుంది..