AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: ‘పుష్ప’ ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. ఈ క్యూట్ వీడియో చూశారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విదేశాల్లోనూ ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. తాజాగా స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్‌ దంపతులు 'పుష్ప' చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాన్ని అచ్చంగా రీక్రియేట్ చేశారు.

Pushpa Movie: 'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. ఈ క్యూట్ వీడియో చూశారా?
Pushpa Movie
Basha Shek
|

Updated on: Oct 08, 2026 | 6:30 AM

Share

సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్‌ దంపతుల గురించి తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాలంటే వీరికి విపరీతమైన అభిమానం. కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఈ దంపతులు రీల్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో కర్ల్ స్వాన్‌బెర్గ్‌ దంపతులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి రీల్స్, వీడియోలకు కూడా నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా ఈ జంట అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమాలోని సీన్ ను రీ క్రియేట్ చేశారు. ఆటోలో కూర్చుని రష్మికను ముద్దు అడిగే రొమాంటిక్ సీన్‌లో వీరిద్దరు జీవించేశారు. ‘బిఫోర్ మ్యారేజ్.. ఆఫ్టర్ మ్యారేజ్ అంటూ పుష్ప, పుష్ప-2 చిత్రాల్లోని సీన్స్‌ జోడించారు. కర్ల్ స్వాన్‌బెర్గ్‌ దంపతుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడే కాదు . ఈ జంట గతంలో పలు టాలీవుడ్ సినిమాల పాటలకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. త్వరలోనే ఈ జంట ఇండియాకు రానుంది. హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తామని ప్రకటించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా. హాలీవుడ్ రేంజ్ లో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతోంది. త్వరలోనే ఈ మూవీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..