AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singeetam Srinivasa Rao: దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంటే?

యావత్ భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప దర్శకుడిగా , రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్న సింగీతం శ్రీనివాసరావు 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సింగీతం ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Singeetam Srinivasa Rao: దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంటే?
Singeetam Srinivasa Rao
Basha Shek
|

Updated on: Oct 05, 2026 | 8:39 PM

Share

ప్రేక్షకుల ఊహలకు అందని కాన్సెప్టులతో సినిమాలు తీసి భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు తెరకెక్కించిన సింగీతం సెల్యులాయిడ్ సైంటిస్ట్ గా పేరు సొంతం చేసుకున్నారు. కేవలం దర్శకత్వంలోనే కాదు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన.. తదితర రంగాల్లోనూ సింగీతం తన ట్యాలెంట్ చూపించారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ఇంకా ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అపూర్వ సహోదరులు’.. ఇలా సింగీతం కెరీర్ లో ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. చివరకు 95ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ (2026) అనే మ్యూజిక్ ఫాంటసీ సినిమాను ఆడియెన్స్ కు అందించిన సింగీతం అక్టోబర్ 04న తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే సినిమాల సంగతి తప్పితే సింగీత ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. చివరకు సింగీతం శ్రీనివాసరావు తన ఫ్యామిలీ గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఎక్కడా కానీ ఆయన తన ఫ్యామిలీ కానీ, వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు . అయితే ఇప్పుడు సింగీతం మరణం నేపథ్యంలో ఆయన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సింగీతం శ్రీనివాస్ రావు 1960లో లక్ష్మీ కల్యాణిని వివాహం చేసుకున్నారు. లక్ష్మీ కల్యాణిది కూడా సినిమా నేపథ్యమే. మంచి రచయిత కూడా. శ్రీ కల్యాణీయం అనే పుస్తకాన్ని రచించిన లక్ష్మీ కల్యాణి నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ చిత్రానికి సృజనాత్మక భాగస్వామి, సహ రచయిత్రిగా కూడా పనిచేశారు. సింగీతం కష్ట సుఖాల్లోనూ కలిసి నడిచిన ఆమె అనారోగ్య సమస్యలతో 2022 మే 28న తుదిశ్వాస విడిచారు. ఇకపోతే సింగీతం, లక్ష్మీ కళ్యాణి దంపతుల పిల్లల విషయానికి వస్తే.. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇదిలా ఉంటే సింగీతం కుమారుడు 39 సంవత్సరాల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సింగీతంకు సుధా కార్తీక్ అనే అమ్మాయి కూడా ఉంది. ఈమె కూడా మంచి రచయితనే. తల్లి రాసిన శ్రీ కళ్యాణీయం అనే పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు సుధా కార్తీక్. అనంతరం ఇదే పుస్తకాన్ని ఈమె కుమారుడు, సింగీతం శ్రీనివాసరావు మనవడు అభినవ్ ఈ – బుక్ వెర్షన్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగానే 2021 నవంబర్ 16న తన మనవడికి శుభాకాంక్షలు చెబుతూ ఒక ఎమోషనల్ పోస్టు కూడా పంచుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. ‘ఒక గర్వపడే తండ్రిగా నా భార్య సింగీతం లక్ష్మీ కళ్యాణి తెలుగులో రచించిన శ్రీ కళ్యాణీయం గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించి, ఆవిష్కరించిన నా కుమార్తె సుధా కార్తీక్ కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే పుస్తకాన్ని ఆన్ లైన్ వెర్షన్ లో ఆవిష్కరించిన నా మనవడు అభినవ్ కి నా శుభాకాంక్షలు’ అంటూ అప్పట్లో రాసుకొచ్చారు సింగీతం. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీ ఫొటో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​
ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​
వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?
వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?
బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే
బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే
బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే
బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే