AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దడ పుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం .. ఒంటరిగా చూడొద్దు

ఈ వీకెండ్ లో మంచి ట్విస్టులున్న హారర్ థ్రిల్లర్ మూవీ కానీ వెబ్ సిరీస్ చూడాలనుకున్నారా? అయితే ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠరేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఆడియెన్స్ ను భయ పెట్టడం ఖాయం.

OTT Movie: ఓటీటీలో దడ పుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం .. ఒంటరిగా చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 6:11 PM

Share

ఓటీటీలో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. అందుకే ప్రతివారం ఓటీటీలో రెండు మూడు సినిమాలు, సిరీస్ లు ఈ జానర్ కు సంబంధించినవే ఉంటాయి. అలా ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. . సూపర్ నేచురల్ అంశాలకు సైకలాజికల్ ట్విస్టులు జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంట రేపే సీన్లు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు మంచి రేటింగ్ దక్కడం విశేషం. ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన ప్రియ అనే మహిళ, తన మూగ, చెవిటి కుమార్తెతో కలిసి చెన్నైలోని ఒక కొత్త అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. పాత జ్ఞాపకాలను మర్చిపోయి, కూతురితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయితే అక్కడ అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆ తల్లీ కూతుళ్లకు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొన్నేళ్ల క్రితం ఆ ఫ్లాట్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనే షాకింగ్ నిజం వారికి ఆలస్యంగా తెలుస్తుంది. ఒకరోజు ఇంట్లో చిన్నారితో కలిసి దాగుడు మూతలు ఆడుతుండగా పాప ఉన్నట్లుండి కనిపించకుండా పోతుంది. దీంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఇదే క్రమంలో తన కూతురు కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక మర్డర్ గురించి తెలుసుకుంటుంది. మరి ఆ హత్యకు, ప్రియ కనిపించకుండా పోవడానికి సంబంధమేంటి?కనిపించకుండా పోయిన కూతురుని ఎలా దక్కించుకుంది? అన్నదే మిగతా స్టోరీ.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు కన్నమూచి. అంటే తెలుగులో దాగుడు మూతలు అని అర్థం. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. కూతురిని వెతుక్కునే ప్రియ అనే తల్లి పాత్రలో అద్బుతంగా నటించింది. యూనికాన్, ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మించాయి. ప్రస్తుతం కన్నమూచి వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 20 నిమిషాల పాటు ఉంది. వీకెండ్ లో మంచి గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి కన్నమూచి వెబ్ సిరీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

కన్నమూచి వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us