AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sigma Movie: సీఎం విజయ్‌ కుమారుడి సినిమా.. ‘సిగ్మా’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా 'సిగ్మా'. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కుమారుడు జేసన్ విజయ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అక్టోబర్ 02న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

Sigma Movie: సీఎం విజయ్‌ కుమారుడి సినిమా.. 'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Sigma Movie
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 5:28 PM

Share

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ మొదటి సారి మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. రాజు సుందరం, సంపత్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇలా రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అయితే గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిగ్మా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. వసూళ్లు కూడా పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే ఫ్లాప్ గా నిలిచే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ లిమిటెడ్, ఎన్‌.వి.ఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను విడుదల చేశాయి. ఇదిలా ఉంటే ‘సిగ్మా’ రిజల్ట్ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సిగ్మా సినిమాకు ముందుగా హీరోగా అనుకున్నది సందీప్ కిషన్ కాదట. దర్శకుడు జాసన్ సంజయ్ తొలుత ఈ స్టోరీని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో చేయాలనుకున్నారట. అయితే అప్పటికే పలు సినిమాలతో దుల్కర్ బిజీగా ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ తర్వాత అదే కథ సందీప్ కిషన్ వద్దకు వెళ్లడం, వెంటనే ఒకే చెప్పడంతో సిగ్మా సినిమా పట్టాలెక్కిందట.

ఇప్పుడు ‘సిగ్మా’కు వస్తున్న స్పందన నేపథ్యంలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ కు కూడా ఇటీవల కొన్ని సినిమాల విషయంలో నిరాశ ఎదురైంది. ముఖ్యంగా అతను నటించిన ‘ఐమ్ గేమ్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ఈ హీరో ఆకాశంలో ఒక తార అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. పవన్ సాధినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?