AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: అచ్చం కేసీఆర్‌లా ఉన్నావ్.. ప్రియదర్శిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని.. వీడియో

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాలో నటుడు ప్రియదర్శి శంకరన్న పాత్రలో అదరగొట్టాడు. అచ్చం కేసీఆర్ ను తలపించేలా ప్రియదర్శి నటన, హావభావాలు, చెప్పిన డైలాగులు ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.

The Paradise: అచ్చం కేసీఆర్‌లా ఉన్నావ్.. ప్రియదర్శిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని.. వీడియో
The Paradise
Basha Shek
|

Updated on: Oct 02, 2026 | 5:08 PM

Share

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ పీరియాడికల్ యాక్షన్‌ మూవీ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సవారీలు అనే జాతి తమ మనుగడ చేసే పోరాటం ఆధారంగా ఈ కథను తెరకెక్కించారు. మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 160 కోట్లకు పైగాకలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాలో భారీ తారగణమే ఉంది. నాని సరసన కయాదు లోహర్ కథానాయిక గా చేసింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజా మాలిక్ అనే కరడుగట్టిన విలన్ పాత్రలో అదరగొట్టాడు. వీరితో పాటు ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ది ప్యారడైజ్ సినిమాలో ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రలు బాగా హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా కేసీఆర్ (శంకరన్న) పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రముఖ నటుడు ప్రియదర్శి ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ఒదిగిపోయాడు. అచ్చం కేసీఆర్ ను తలపించేలా అతని ఆహార్యం, నటన, హావభావాలు, చెప్పిన డైలాగులు ఆడియెన్స్ ను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘చావు నోట్లో తలకాయ పెట్టైనా సరే మీకు గుర్తింపు తీసుకొస్తా’ అని ప్రియదర్శి నానితో అన్న డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

కాగా శంకరన్న పాత్రలో జీవించిన ప్రియదర్శిపై ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. కేసీఆర్‌ లుక్‌లో ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తాజాగా ప్రియదర్శిని కలిసిన ఓ మహిళా అభిమాని ఎమోషనలైంది. కేసీఆర్‌లా అద్భుతంగా చేశావంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందుకు ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు స్వయంగా ప్రియదర్శిని కలిసి అభినందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి పాత్రలో ప్రియదర్శి జీవించారని హరీష్ కొనియాడారు. కేసీఆర్‌ గారి హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమని.. కానీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us