Aaruguru Pathivrathalu: ‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వస్తున్నారు.. థియేటర్లలో ఈవీవీ బోల్డ్ మూవీ.. రిలీజ్ డేట్ ఇదే
ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఈ బోల్డ్ అండ్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీని తెరకెక్కించారు. దాదాపు 22 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.

ఈవీవీ సత్యనారాయణ బోల్డ్ అండ్ రియలిస్టిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమా ‘ఆరుగురు పతివ్రతలు’. 2004లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ఓ టాలీవుడ్ లో సెన్సేషన్ గా నిలిచింది.. అప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో తెరకెక్కించిన డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ ఈ బోల్డ్ మూవీని తెరకెక్కించడం గమనార్హం. ఈ సినిమాకు కేవలం డైరెక్టర్ గానే కాదు నిర్మాతగానూ వ్యవహరించారు ఈవీవీ. కల్ట్ ఫాలోయింగ్‌తో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో మళ్లీ రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘ఆరుగురు పతివ్రతలు’ మూవీని 4K వెర్షన్‌లో అక్టోబర్ 29 (గురువారం) మళ్లీ రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ బోల్డ్ సినిమాలో సినిమాలో దాదాపు 40 మంది కొత్త వారు నటించడం విశేషం. అమృత, లహరి, చలపతి రావు, ఎల్‌బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకోలాంటి భర్తల సైకాలజీ, లవ్, ఎమోషన్స్ వంటి అంశాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ ఈవీవీ. మరి అప్పట్లో ఓ మోస్తరుగా ఆడిన ఈ ఆరుగురు పతివ్రతలు సినిమా రీ రిలీజ్ లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
ఆరుగురు పతివ్రతలు సినిమా విషయానికి వస్తే.. పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆరుగురు అమ్మాయిలు పెరిగి పెద్దైన తర్వాత ఓసారి కలుసుకోవాలని అనుకుంటారు. అలా ఓ పెళ్లి సందర్భంలో కలుసుకున్న వారు తమ జీవితాల్లో అప్పటివరకూ జరిగిన ఘటనలు గుర్తు చేసుకుంటారు. పెళ్లి, వైవాహిక జీవితం, భర్తల వల్ల పడే ఇబ్బందులు, తమకు ఎదురైన కష్ట సుఖాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. అయితే భర్తలని అర్థం చేసుకోవడంలో భార్యల ఆలోచనలు ఎలా ఉంటాయి? భర్తల అనుమాన స్వభావం వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు.
అక్టోబర్ 29న మళ్లీ థియేటర్లలోకి ఆరుగురు పతివ్రతలు..
#AaruguruPathivrathalu is all set for a grand re-release on October 29th! 💥
@pochammafilms pic.twitter.com/mHXWVlZhtt
— Suresh PRO (@SureshPRO_) October 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
