AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ట్విస్ట్ ల మీద ట్విస్టులతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా 4 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో వారంలోకి కూడా అడుగు పెట్టింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Oct 05, 2026 | 8:13 PM

Share

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారం ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక మూడో వారం ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. అయితే నాలుగో వారం అనూహ్యంగా సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక సోమవారం అంటేనే బిగ్ బాస్ లో నామినేషన్ల రచ్చ ఉంటుంది. అయిదో వారం నామినేషన్ ప్రక్రియ కూడా రసవత్తరంగా సాగిందని తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఒకరి తప్పులను మరొకరు చెప్తూ, మాటల యుద్ధానికి దిగారు. త్రిగుణ్, అపూర్వ, రోహిత్, ముఖేష్, వర్షిణి మధ్య ఎక్కువగా సంభాషణలు జరిగినట్టు ప్రోమోలు చూస్తే అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్ మధ్య మాటల యుద్దం ఎక్కువగా అయినట్టు కనిపిస్తోంది. మధ్యలో ముఖేష్, వర్షిణిల పేర్లను కూడా అపూర్వ తీసినట్టు అనిపిస్తోంది. మొత్తానికి ఐదో వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు తెలుస్తోంది

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ అయిదో వారంలో త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయ్యారని సమాచారం. ఇదిలాఉటే ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉంటుందని టాక్. ఎందుకంటే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లను ఇంటికి పంపిస్తారని సమాచారం. ఐదో వారం నామినేషన్ లిస్ట్ చూస్తుంటే మాత్రం చరణ్, షాలినీ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొదటి వారమే ఎలిమినేట్ అయిన చరణ్ అదృష్టం బాగుండి మళ్లీ హౌస్ లోకి వచ్చాడు. కానీ అతనిలో మాటలు తప్పితే ఆట లేదన్న విమర్శలు వస్తున్నాయి. తక్కువ ఓటింగ్ ఉన్న చరణ్ నాలుగో వారమే ఎలిమినేట్ అవ్వాల్సింది. అయితే త్రుటిలో మిస్ అయ్యాడు. ఇక షాలినీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వారం ఎలిమినేషన్ లో సృష్టితో పోటీ పడింది. ఈ వారం సత్తా చాటకుంటే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ ను వీడతారని సమాచారం.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us