AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teja Sajja: తేజా సజ్జా కాబోయే భార్య ఎవరో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

హనుమాన్, మిరాయ్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ల తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా భారీ సీక్వెల్స్ , క్రేజీ ప్రాజెక్ట్‌లతో తన లైనప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న తేజా సజ్జా.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు.

Teja Sajja: తేజా సజ్జా కాబోయే భార్య ఎవరో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Teja Sajja
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2026 | 7:27 AM

Share

బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజా సజ్జా. ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైన ఈ యంగ్ హీరో.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు బుల్లితెరపై రియాలిటీ షో హోస్ట్‌గా కూడా తనదైన శైలిలో అలరిస్తున్నాడు. అయితే తాజాగా తేజా సజ్జా తన జీవితంలో మరో కీలక అడుగు వేశాడు. నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో సోమవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తేజా సజ్జా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాబోయే భార్య ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? పెళ్లి ఎప్పుడు జరగనుంది? అనే విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

తేజా సజ్జా నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు మౌర్య. ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. హైదరాబాద్‌కు చెందిన మౌర్య అమెరికాలో పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే తన తండ్రికి చెందిన టెక్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.  తేజా సజ్జా, మౌర్య పరిచయం ఎలా ఏర్పడింది? వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? లేక కుటుంబ సభ్యులు చూసి పెళ్లి సంబంధం కుదిర్చారా? అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరి పరిచయం, వివాహ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

నిశ్చితార్థంతో వార్తల్లో నిలిచిన తేజా సజ్జా పెళ్లి తేదీపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో పెళ్లి వేడుక ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు కెరీర్ పరంగా తేజా సజ్జా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘హనుమాన్’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ‘మిరాయ్’తో పాటు ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్‌కు సంబంధించిన వార్తలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం.. రెండింటితోనూ తేజా సజ్జా వార్తల్లో నిలుస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us