కల్లు తాగుతున్న రామచిలకలు.. చూసేందుకు ఎగబడుతున్న కల్లు ప్రియులు.. !
ప్రకృతిలో కనిపించే కొన్ని దృశ్యాలు మనుషులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సాధారణంగా చెట్లపై వాలుతూ పండ్లు, గింజలు తింటూ కనిపించే రామచిలుకలు.. ఇప్పుడు కల్లు తాగుతూ సందడి చేస్తున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యం కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులోని ఈత, తాటివనంలో కనిపించింది. దీంతో ఈ ప్రాంతం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

జమ్మికుంట శివారులోని ఈత, తాటిచెట్ల వనంలో రామచిలుకల గుంపు కల్లుగుత్తుల వద్దకు చేరుకుంటోంది. చెట్టుకు వేలాడుతున్న కల్లుగుత్తుల్లోని తీపి రసాన్ని తమ పొడవాటి ముక్కులతో ఆస్వాదిస్తూ కనిపిస్తున్నాయి. గుంపులుగా వచ్చి కల్లు తాగుతున్న రామచిలుకల దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సహజంగా రామచిలుకలు కనిపించడమే అరుదుగా భావించే స్థానికులకు, ఇలా గుంపులుగా వచ్చి కల్లు తాగడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
మరోవైపు రామచిలుకలు తాగిన కల్లు తాగితే రుచి బాగుంటుందనే నమ్మకం చాలా ఏళ్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొందరు కల్లు ప్రియులు రామచిలుకలు కల్లు తాగుతున్న దృశ్యాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆ పక్షుల సందడిని చూస్తూ ఆనందిస్తున్నారు.
మొత్తానికి జమ్మికుంట శివారులోని ఈత, తాటివనం రామచిలుకల సందడితో కళకళలాడుతోంది. ప్రకృతి అందాలకు పక్షుల అల్లరి తోడవడంతో ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అయితే రామచిలుకలు తాగిన కల్లుకు ప్రత్యేక రుచి ఉంటుందనే నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..