AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: ‘రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

మొత్తం రెండు భాగాలుగా 'రామయాణ' సినిమా రాబోతుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తాజాగా 'రామాయణ' చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న చోట భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Ramayana Movie: 'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Ramayana Movie
Basha Shek
|

Updated on: Oct 05, 2026 | 7:47 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’. దంగల్ ఫేమ్ నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్‌ యశ్‌ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా రామాయణ షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. సోమవారం (అక్టోబర్ 05) సాయంత్రం ఫిల్మ్ సిటీలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక భాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  సుమారు వంద అడుగుల తాత్కాలిక సెట్‌‌లోని పీసీఆర్ యూనిట్‌లో ఈ మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ వైరింగ్, కేబుల్స్, తలుపులు, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, బాంబులు, ప్లాస్టిక్ సామగ్రి, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్ పరికరాలు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముంబై ఫైర్ సిబ్బంది, పోలీసులు, బీఎంసీ వార్డ్ కంట్రోల్, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, చుట్టుపక్కల సెట్లలో ఉన్న నటీనటులు, సిబ్బంది, ఇతర ఉద్యోగులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ వెంటనే సహాయక చర్యలు చేపట్టి సకాలంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ముంబై ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చాలా దగ్గరలో ‘ఎమ్‌టివి హస్ల్’ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్ కోసం రాపర్ బాద్షా సెట్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు, స్క్వాడ్ బాస్‌లు, జ్యూరీ,  షో ఫైనలిస్టులు కూడా అక్కడే ఉన్నారు. అలాగే  ‘పతి పత్ని ఔర్ పంగా’ షో సెట్ ‘ఎమ్‌టివి హస్ల్’ సెట్‌కు సరిగ్గా పక్కనే ఉంది. ఇది కాకుండా, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కొంత దూరంలో ఒక యాడ్ షూట్ కోసం హాజరైనట్లు చెబుతున్నారు. కాగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే   అన్ని సెట్‌లలో చిత్రీకరణను తక్షణమే నిలిపివేశారు. ఆ ప్రాంతంలో భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..