AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యో.. పక్షవాతంతో మంచాన పడ్డ టాలీవుడ్ కమెడియన్.. ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు

తెలుగులో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడీ కమెడియన్. తన దైన నటనతో ఆడియెన్స్ ను కడపుబ్బా నవ్వించాడు. అయితే ప్రస్తుతం ఈ నటుడు తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టాడు. కనీసం కదల్లేని స్థితిలో ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

Tollywood: అయ్యో.. పక్షవాతంతో మంచాన పడ్డ టాలీవుడ్ కమెడియన్.. ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు
Tollywood Actor
Basha Shek
|

Updated on: Oct 07, 2026 | 8:55 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఒకప్పుడు ఈ కమెడియన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆడియెన్స్ ముఖాల్లో నవ్వులు విరిసేవి. అమాయకంగా ఫేస్ పెట్టి అతను డైలాగులు చెబుతుంటే తెలుగు జనాలు తెగ నవ్వుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ తన మార్క్ కామెడీతో అలరించిన ఈ కమెడియన్ ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు. పక్షవాతంతో బారిన పడి కనీసం నడవలేని దీన పరిస్థితిలో ఉన్నాడు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. సహాయం కోసం వేడుకుంటున్నాడు. అతను మరెవరో కాదు ‘వెంకీ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కమెడియన్ రామచంద్ర. ఒక్క వెంకీ నే కాదు ఆనందం, సొంతం, కింగ్, దుబాయి శీను, లౌక్యం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు రామచంద్ర. తనదైన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ గా కనిపించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే వందకు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన రామచంద్ర కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి తోడు పెరాలసిస్ సోకడంతో ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి ఆయన ఎడమ చేయి, కాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఆయన నడవలేని, కదలలేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు.

రామచంద్రకు పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు కూడా కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం తమ్ముడే అతని బాగోగులు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామచంద్ర తమ్ముడు తన ఆవేదనను పంచుకున్నాడు. రామచంద్ర దాదాపు ఏడాదిగా రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉంటున్నాడు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు. వారి సహాయం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాం. అయితే ఇప్పుడు మాకు నెలకు రూ. 2-2.5 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ఇంకో రెండు మూడు నెలలు వరకు ఇక్కడే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ అయ్యే వైద్య ఖర్చులు, థెరపీకి డబ్బులు లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. దాతలు స్పందించి ఎంతో కొంత ఆర్థికసాయం అందిస్తే.. వైద్యానికి ఉపయోగపడుతుంది’ అని విజ్ఞప్తి చేశారు రామచంద్ర సోదరుడు.

Tollywood Comedian Ramachan

Tollywood Comedian Ramachandra

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us