అతడంటే పిచ్చి ఇష్టం.. ముందు నిలబడితే యాక్టింగే మర్చిపోతా.. అనుపమ..

Rajitha Chanti

Pic credit - Instagram

21 October 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు కోట్లాది మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు.

50 ఏళ్ల వయసులోనూ అత్యంత యంగ్‌గా కనిపిస్తూ యూత్‌ను ఆకట్టుకుంటున్న మహేష్ బాబుపై క్రష్ అని అన్నారు అనుపమ పరమేశ్వరన్

తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రశ్న ఎదురైంది.

మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనో గ్రేట్ హ్యాండ్సమ్ హీరో అని అన్నారు. ఆయనపై తనకు ఎప్పట్నుంచో క్రష్ ఉందని అన్నారు. 

మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే పాత్ర ఏదైనా సరే చేయడానికి తాను సిద్ధమని ఆమె తెలిపారు. ఈ కామెంట్స్ వైరలవుతున్నాయి

మహేష్ బాబుతో కలిసి నటించేటప్పుడు ఆయనను కోపంగా లేదా విలనిజంగా చూడాల్సిన సన్నివేశం వస్తే ఎలా నటిస్తారని యాంకర్ ప్రశ్నించారు.

ఆయనను కోపంగా చూడమంటే బహుశా రొమాంటిక్‌గా చూసేస్తానేమో అంటూ సరదాగా అన్నారు. ముందు నిలబడితే యాక్టింగ్ మర్చిపోతా అన్నారు.

అంతేకాదు, మహేష్ బాబు పక్కన నిలబడితే ఆయన అందాన్ని చూస్తూ అసలు యాక్టింగే మర్చిపోయే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.