AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా మృతదేహాలు.. OTTలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..

ఒక ప్రాంతంలోని నది ఒడ్డున మనుషుల శరీర భాగాలు కుప్పులు తెప్పలుగా దొరుకుతాయి. వీటిని చూసిన పోలీసులు నదిలోని మొసలే మనుషులను తినేసి ఉంటుందని భావిస్తారు. అయితే అసలు నిజం వేరే ఉంటుంది. మొసలి పేరు చెప్పుకొని ఒక సైకో కిల్లర్ చేసే అరాచకాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.

OTT Movie:  నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా మృతదేహాలు.. OTTలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 01, 2026 | 9:58 PM

Share

వీకెండ్ లో ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వెబ్ సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కేవలం 7 ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్.. ప్రతీ ఎపిసోడ్ 20 నుంచి 22 నిమిషాల నిడివితో చాలా రేసీగా, ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లోని ట్విస్ట్ లు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. అందుకే ఐఎమ్ డీబీలో ఈ సిరీస్ కు ఏకంగా 7.2 రేటింగ్ దక్కింది. ఈ సిరీస్ స్టోరీ కూడా చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తర కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామం, దానికి ఆనుకుని ప్రవహించే మలప్రభ నది బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్ సాగుతుంది. ఉన్నట్లుండి నది ఒడ్డున వింత పరిస్థితుల్లో వరుసగా మృతదేహాలు దొరుకుతాయి. వీటిని చూసిన పోలీసులు, గ్రామీణులు పాత మూఢనమ్మకాలు, గ్రామ దేవత శాపం, లేదా మొసళ్ల దాడుల వల్ల ఈ చావులు జరుగుతున్నాయని భావిస్తారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు సబ్ ఇన్ స్పెక్టర్ హనుమప్ప రంగంలోకి దిగుతాడు. అతను గ్రామస్తుల మూఢనమ్మకాలను అస్సలు నమ్మడు.. పట్టించుకోడు కూడా. సరిగ్గా ఈ హత్యలు జరుగుతున్న సమయంలోనే సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్ లో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. మరి వారంతా ఏమయ్యారు? అసలు ఎలాంటి ఆనవాళ్లు, గుర్తులు లేకుండా వారు ఎలా మాయమయ్యారు? నది ఒడ్డున దొరికిన మృతదేహాలు ఎవరివి? మొసళ్ల దాడివల్లే వాళ్లు చనిపోయారా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? మరి పోలీసులు ఈ క్రైమ్ మిస్టరీని ఎలా ఛేదించారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ కు భయపెడుతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు ‘రాక్షస’. 2022లో వచ్చిన సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్ ‘విలంగు’ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించచారు. హిందీలో కూడా ఇది ‘జానవర్’ పేరుతో ఇది రీమేక్ కాగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. సుహాన్ ప్రసాద్ తెరకెక్కించిన రాక్షస వెబ్ సిరీస్ లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి, అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజిత్, హులుగప్ప కత్తిమని, మహాదేవ్ హడాపద్, సుష్మిత జగప్ప తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రాక్షస వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?